PAN-Aadhar Card : బిగ్ అలర్ట్..పాన్ కార్డు ఆధార్‌ లింక్ చేయలేదా..? ప్రశ్నార్థకంగా 10కోట్ల మంది ఎన్నారై పాన్‌కార్డుల పరిస్థితి,ఐటీ శాఖ కీలక ప్రకటన

పాన్ కార్డు ఆధార్‌ లింక్ చేయలేదా..? అయితే ఇబ్బందులు తప్పవంటు ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వార్నింగ్ ఇచ్చింది. మీరు ఎన్నారైలు అయితే ఇబ్బందులు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. దీంట్లో భాగంగానే 10కోట్ల మంది ఎన్నారై పాన్‌కార్డుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సబంధించి ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది...

PAN Card-Aadhar card Link

PAN Card-Aadhar card Link IT : పాన్ కార్డు (PAN Card)ఆధార్ కార్డు (Aadhar card) లింక్ (Link )చేసుకోవాలని పదే పదే ఐటీ శాఖ (Incom tax dept )ప్రకటించింది. దీనికి పలు మార్లు గడువు కూడా ఇచ్చింది. కానీ చాలామంది నిర్లక్ష్యమో లేదా మరేదైనా కారణలతోనే గానీ లింక్ చేసుకోకపోవటం వల్ల చాలా ఇబ్బందికరపరిస్థితులు వచ్చాయి. అటువంటి వారికి బిగ్ అలర్ట. ఆధార్ నంబర్‌తో లింక్ చేసేందుకు గడువు ముగిసిపోవటంతో అటువంటి వారికి తిప్పలు తప్పవని ఐటీశాఖ హెచ్చరించింది. అలా లింక్ చేయని 10 కోట్ల పాన్ కార్డులు ( 10 crore NRIs PANs)పని చేయకుండా పోయినట్లు అందిన ఫిర్యాదుపై ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం కీలక ప్రకటన చేసింది. పాన్ కార్డులు పనిచేయకుండా పోయిన కారణాలు వెల్లడించింది. అలాగే ఎన్ఆర్ఐ (Non Resident Indians)ల పాన్ కార్డులు ఆధార్ లింక్ చేయకపోయినా యాక్టివ్ స్టేట్లో ఉంటాయని తెలిపింది. పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ చేయకుండా పోతే.. పాన్ పనిచేసే అవకాశం లేదని, ఈ కారణంగా తప్పకుండా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

పాన్ కార్డుతో ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చాలా కాలంగా చెబుతూనే ఉంది. దీనికి ఎన్నో గడువులు కూడా ఇచ్చింది. అలా డెడ్ లైన్ జూన్ 30, 2023తో ముగిసిపోయింది. మళ్లీ గడువు పెగుతుందని అనుకున్నవారికి ఇది పెద్ద షాకే అయ్యింది. ఈక్రమంలో ఐటీ శాఖ నుంచి రీసెంట్ గా అప్‌డేట్ వచ్చింది. గడువు ముగిసిన తర్వాత కూడా ఆదాయపు పన్ను శాఖకు సోషల్ మీడియా నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఓ ట్విట్టర్ యూజర్ ఫిర్యాదు చేస్తు.. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (NRIs)ల పాన్ ఆధార్ అనుసంధానం గురించి ప్రశ్నిస్తు.. 10 కోట్ల మందికిపైగా ఎన్ఆర్ఐల పాన్ కార్డులు పని చేయకుండా పోయాయని వెల్లడించారు. దీంతో ఇండియాలో వారు చేసిన పెట్టుబడులు, బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం ఫ్రీజ్ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 3 స్కామ్‌లతో తస్మాత్ జాగ్రత్త.. డిస్కౌంట్లు చూసి టెంప్ట్ అయ్యారంటే అంతే..!

ట్విట్టర్ యూజర్ ఫిర్యాదుకు స్పందించి ఆదాయపు పన్ను శాఖ. దీనిపై క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసింది. పాన్ కార్డుతో ఆధార్ నంబర్ లింక్ చేయకపోతే పాన్ పని చేయకుండా పోతుందని సుస్పష్టం చేస్తు కొన్ని ఇబ్బందులు తప్పవని వెల్లడించింది. ఎవరైతే ప్రవాస భారతీయులు (Non Resident Indians) ఉంటారో.. వారు తమ ఎన్ఆర్ఐ స్టేటస్‌ను ఆదాయపు పన్ను శాఖకు ముందే తెలియజేసి ఉన్నట్లయితే వారికి పాన్-ఆధార్ లింక్ చేయడం నుంచి మినహాయింపు కల్పించామని వెల్లడించింది. దీంతో ఎన్ఆర్ఐ స్టేటస్ అప్డేట్ చేసిన వారి పాన్ కార్డు చెల్లుబాటులోనే ఉంటుందని స్పష్టం చేసింది.

అలాగే ఎవరైనా తమ ఎన్ఆర్ఐ స్టేటస్ చెప్పకుండా పాన్ కార్డు పని చేకుండా పోయిందా వారు ఏం చేయాలో కూడా వెల్లడించింది. పాన్ కార్డు క్లోజ్ అయిన ఎన్ఆర్ఐలు ఉంటే వెంటనే ఆన్‌లైన్ ద్వారా తమ జ్యూరిస్డిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్ ( Jurisdictional Assessing Officer (JAO) ను సంప్రదించాలని సూచించింది. పాన్ కార్డు విదేశాల్లో నివసిస్తున్నట్లుగా చూపించే పాస్ పోర్టు కాపీ వంటి డాక్యుమెంట్లను సమర్పించాలని సూచించింది. అటువంటివాటిని తనీఖి చేసి పాన్ కార్డు డేటాబేస్ (PAN Card Database)లో అప్ డేట్ చేసిన పాన్ స్టేటస్ (PAN Status)యాక్టివ్ చేస్తారని వెల్లడించింది. మరో ఎన్నారై తన పాన్ కార్డు పనిచేయడం లేదని..దానికి యాక్టివేట్ చేసుకోవటం ఎలాగో చెప్పాలని అడిగారు. దానికి ‘ఈ మెయిల్ (Email)ద్వారా ట్యాక్స్ పేయర్ (Tax Payer) వివరాలుతో పాటు పాన్ కార్డు కలర్ జిరాక్స్(PAN Card Color xerox ), నాన్ రెసిడెంట్ స్టేటస్ (Non Resident Status)తెలిపే పాస్ పోర్టు (Passport)వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను జతచేయాలని వెల్లడించింది. adg1.systems@incometax.gov.in & jd.systems1.1@incometax.gov.in మా టీమ్ వాటిని మా టీమ్ పరిశీలించి అప్డేట్ చేస్తుంది.’ అని వెల్లడించింది.

Reliance Jio Plans : రిలయన్స్ జియో 2 కొత్త రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. 5G డేటా బెనిఫిట్స్ మీకోసం.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

 

ట్రెండింగ్ వార్తలు