ప్రియుడితో కూతురు వెళ్లిపోయింది: పరువు పోయిందని తల్లిదండ్రుల ఆత్మహత్య 

  • Publish Date - May 6, 2019 / 08:21 AM IST

ప్రేమ పెళ్లిళ్లు.. ఇందులో రెండు కోణాలు.. రెండు కోణాలు సున్నితమైనవే. ఓవైపు ప్రేమికుల వెర్షన్. మరోవైపు తల్లిదండ్రులు వెర్షన్. ఏది హర్ట్ అయినా కూడా క్షణికావేశంలో ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి. ఇటువంటి పరువు  ఆత్మహత్యే కర్ణాటకలో చోటుచేసుకుంది. నిశ్చితార్థం జరిగిపోయింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు ప్రియుడితో వెళ్లిపోయింది. తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు పరువు పోయిందనే బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఈ విషాద సంఘటన బెంగళూరు సమీపంలోని గౌరిబిదనూరు తాలూకా దేవనహళ్ళిలో  చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చౌడప్ప (45), చౌడమ్మ (40) దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమరుడు. పెద్ద కూతురు అనుశ్రీ మూడేళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రెండో కూతురు మధుశ్రీకి ఇటీవల నిశ్చితార్ధం జరగగా.. ఆ పెళ్లిని కాదని ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయింది.

ఈ విషయం జీర్ణించుకోలేని తల్లిదండ్రులు గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.