Parliament Budget Sessions : జనవరి 31నుంచి రెండు విడతల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎలా జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

Parliament Budget sessions : దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎలా జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. కరోనా దృష్ట్యా ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. పార్లమెంట్ సమావేశాల తేదీలపై లోక్ సభ సచివాలయం ప్రకటన విడుదల చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి.

మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది. మొదటి విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జనవరి 31న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల నిర్వహణ కోసం పార్లమెంట్‌లో శానిటేషన్ పనులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పరిశీలించారు. 60 ఏళ్లు పైబడిన ఎంపీల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాలకు పార్లమెంట్‌లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.


ఇటీవల పార్లమెంట్‌లో 400 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జనవరి 4 నుంచి 8 తేదీల మధ్య కరోనా కేసులు నమోదయ్యాయి. పార్లమెంట్‌లో 1409 సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 402మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. పాజిటివ్‌గా నిర్ధారణ వారిలో 200 మంది లోక్‌సభ సిబ్బంది, 69 మంది రాజ్యసభ సిబ్బంది, 133 మంది అనుబంధ సిబ్బందిగా అధికారులు వెల్లడించారు. కొంతమంది ఐసోలేషన్‌లో ఉన్నారు.

Read Also : Covid-19 Curbs : జనవరి 31 వరకు కొవిడ్ ఆంక్షలు పొడిగింపు.. స్కూళ్లు బంద్!

ట్రెండింగ్ వార్తలు