Parliament : జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్.. ఈసారి రెండు విడతలు

కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పార్లమెంట్ లో సానిటేషన్ పనులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నుల జరుగుతున్న తీరును లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం పరిశీలించారు.

Parliamant

Parliament budget sessions : భారత్ లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగున్నాయి. రెండు విడతల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. మార్చి14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పార్లమెంట్ లో సానిటేషన్ పనులు, ఇతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జరుగుతున్న తీరును లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం పరిశీలించారు. వచ్చే బడ్జెట్ సమావేశాలకు పార్లమెంట్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Corona Virus : ఏపీ, తెలంగాణ గ్రామాలపై కరోనా పంజా.. పండగల ప్రయాణాలతో పెరిగిన కేసుల ఉధృతి

ఒమిక్రాన్ వ్యాప్తి సందర్భంగా ఎంపీలు, సిబ్బంది సురక్షితంగా ఉంటారని సమావేశాలు సజావుగా సాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనాపై సమీక్షించి, సురక్షితంగా సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ఉభయ సభల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.