Corona Virus : ఏపీ, తెలంగాణ గ్రామాలపై కరోనా పంజా.. పండగల ప్రయాణాలతో పెరిగిన కేసుల ఉధృతి

తెలంగాణలో 24గంటల్లో 2,700కు పైగా కేసులు వచ్చాయి. అందులో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. వారం రోజులుగా 15జిల్లాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.

10TV Telugu News

Corona spread in rural areas : తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ కోవిడ్ వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలో గత రెండు వేవ్‌ల్లో వ్యాది తీవ్రత ఎక్కువగా ఉండగా వ్యాప్తి మాత్రం కంట్రోల్‌లోనే ఉంది. కానీ ఈసారి మాత్రం వ్యాధి తీవ్రత కంటే వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే గ్రేటర్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండగా.. పండగలకు జనం గ్రామాలకు తరలి వెళ్లడంతో అక్కడ వ్యాప్తి పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పండగ వేళ పట్నం నుంచి జనంతో పాటు కరోనా కూడా పండక్కి వచ్చేసింది. దీంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ పట్టణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఇప్పుడు గ్రామాల్లో ఉధృతి కనిపిస్తోంది.

తెలంగాణలో 24గంటల్లో 2వేల 7వందలకు పైగా కేసులు వచ్చాయి. అందులో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. గత వారం రోజులుగా 15జిల్లాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మెదక్‌, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, వరంగల్‌ జిల్లాల్లో గత వారంరోజులతో పోల్చితే కేసుల సంఖ్య పెరిగినట్లు చెబుతున్నారు.

Food Processing Units : తెలంగాణలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లకు ప్రాధాన్యత

పండగ సందర్బంగా రాకపోకలు ఎక్కువగా ఉండటంతో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య వర్గాలు విశ్లేషించాయి. మంచిర్యాల జిల్లాలో ఏడు రోజుల్లో కేసులు మూడింతలకు పైగా పెరిగాయి. భద్రాద్రి కొత్తగూడెంలో రెట్టింపు స్థాయిలో కేసులు వచ్చాయి. వికారాబాద్‌లో ఈనెల 7న 9 కేసులు వస్తే నిన్న 36మంది దీని బారిన పడ్డట్లు గుర్తించారు. GHMC పరిధిలో మాత్రం కేసులు ఆ వేగంతో పెరగకపోవడం ఒక్కటే ఊరట. ఈనెల 7న 1452కేసులు రాగా నిన్న అంటే 13న 13వందల 28మంది దీనిబారిన పడ్డారు.

నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. టెస్టులకు కొంతమంది ముందుకు రాకపోవడం, సాధారణ జలుబుగా భావించి జనంలో తిరుగుతుండటంతో కేసుల వ్యాప్తి పెరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పండగ ముగిసేసరికి గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య మరింత పెరగనుంది.

Omicron : దేశంలో 5,753 ఒమిక్రాన్ కేసులు

ఇక ఏపీలోనూ కరోనా ఉరుముతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల ఆరంభం వరకూ కంట్రోల్‌లో ఉన్న కేసులు తర్వాత వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నెల 7న ఏపీలో వచ్చిన కేసులు 840. కానీ నిన్నటి లెక్కల ప్రకారం 24గంటల్లో 4వేల348మంది దీని బారిన పడ్డారు. అంటే వారం రోజుల్లోనే కేసుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. అదీ గ్రామీణ ప్రాంతాల్లోనే కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది.

విజయనగరం జిల్లాలో 7వ తేదీన 49 కేసులు వస్తే నిన్న 290మంది వైరస్‌ బారిన పడ్డారు. శ్రీకాకుళంలో వారం క్రితం 25కేసులు వస్తే అది ఇప్పుడు 260కి చేరింది. అనంతపురంలో 33నుంచి 230కి చేరింది. ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పండగ కోసం కొన్ని లక్షలమంది పట్నం నుంచి సొంతూళ్లకు చేరారు. చుట్టాల ఇళ్లకు రాకపోకలు పెరిగాయి. దీంతో కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

×