Omicron : దేశంలో 5,753 ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కు చేరింది.

Omicron : దేశంలో 5,753 ఒమిక్రాన్ కేసులు

Omicron (3)

omicron cases in india : దేశంలో ఒకవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ విజృంభిస్తోంది. రోజు రోజుకూ భారీగా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 2,64,202 కరోనా కేసులు నమోదు కాగా, ఒక్కరోజులో వైరస్ బారిన పడి 315 మంది మరణించారు. గత 24 గంటల్లో 1,09,345 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో రోజువారీ కరోనా పాజివిటీ రేటు 14.78 శాతానికి పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,582,129కు చేరింది. దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడి 4,85,350 మంది మరణించారు.

ప్రస్తుతం భారత్ లో 12,72,03 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మొత్తం 3,48,24,706 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కు చేరింది. మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు భారత్ లో 364 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 73,08,669 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటివరకు 155.39 కోట్ల డోసుల టీకాలు అందజేశారు.

Chiranjeevi : మరోసారి రాజ్యసభకు మెగాస్టార్‌ చిరంజీవి..?

మరోవైపు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండగా.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మాఘమేళా నిర్వహించబడుతోంది. ఈ విశ్వాస ఉత్సవం కరోనా సూపర్ స్ప్రెడర్ మారవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ, మకర సంక్రాంతి సందర్భంగా లక్షలాది మంది స్నానాలు చేస్తారు. 47 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు గంగానదిలో స్నానం చేస్తారు.

లక్షల మంది జనం రావడంతో సన్నాహాలు కూడా భారీగా జరిగాయి. కరోనా మహమ్మారి మూడవ వేవ్ కారణంగా ఈ ఉత్సవంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాఘమేళాలో ఇప్పటివరకు 51 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లుగా గుర్తించారు. మొత్తం ప్రయాగ్‌రాజ్ జిల్లాలో 379 మంది రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చింది. కరోనా విశ్వరూపం తర్వాత కూడా మాఘమేళా పరిస్థితి మారలేదు. ప్రభుత్వమే కరోనా విస్తృతంగా ఉందని చెబుతున్నా నిర్లక్ష్యమే కనిపిస్తోంది.

Corona India : భారత్ లో విజృంభిస్తున్న కరోనా.. 2.62 లక్షలకు చేరిన రోజువారీ కేసులు

జనవరి 17వ తేదీ నుంచి పౌష్ పూర్ణిమ సోమవారం ప్రారంభం అవుతుంది. లక్ష మందికి పైగా సాధువులు, మహాత్ములు కల్పవాసాలు చేస్తారు. మాఘమేళాను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తూనే ఉంది. ఎక్కువ మంది సాధువులు కనీసం మాస్క్ కూడా లేకుండా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాఘమేళాపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి.