రెండు విడతల్లో పార్లమెంట్ సమావేశాలు : ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరుగనున్నాయి. బడ్జెట్‌ సమావేశాలను జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ సిఫార్సు చేసింది.

  • Publish Date - January 9, 2020 / 08:07 AM IST

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరుగనున్నాయి. బడ్జెట్‌ సమావేశాలను జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ సిఫార్సు చేసింది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరుగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత, మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వ తేదీ వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపట్టనున్నారు. మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతునున్నారు. 

బడ్జెట్‌ సమావేశాలను జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలన్న సీసీపీఏ.. తొలి దశను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో దశను మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు పేర్కొన్నట్లు బుధవారం (జనవరి 8, 2020) సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు దశల మధ్య సాధారణంగా నెల రోజుల విరామం ఉంటుంది. బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులను ఈ కాలంలో పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి.

కేంద్ర బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పలు రంగాల నిపుణులతో బడ్జెట్ రూపకల్పనపై సమావేశాలు నిర్వహించారు. మై గౌట్ యాప్ ద్వారా బడ్జెట్ పై కేంద్రం దేశ పౌరుల నుంచి సలహాలు, సూచనలు కోరింది. ఆర్థికమాంద్యం నేపథ్యంలో 2020-21 వార్షిక బడ్జెట్ పై ఉత్కంఠ నెలకొంది.