పెరోల్ అవకాశమొచ్చినా జైలులోనే ఉంటానన్న చిన్నమ్మ శశికళ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జైలులో ఉన్న ఖైదీలను బెయిల్, పెరోల్ పై పెద్ద సంఖ్యలో బయటకు పంపిన విషయం తెలిసిందే. దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు పెరోల్ అవకాశం వచ్చినా జైలులోనే ఉంటానన్నట్లు సమాచారం.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జైలులో ఉన్న ఖైదీలను బెయిల్, పెరోల్ పై పెద్ద సంఖ్యలో బయటకు పంపిన విషయం తెలిసిందే. దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు పెరోల్ అవకాశం వచ్చినా జైలులోనే ఉంటానన్నట్లు సమాచారం.
దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు శశికళకు పెరోల్ అవకాశం వచ్చినా జైలులోనే ఉంటానన్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జైలులో ఉన్న ఖైదీలను బెయిల్, పెరోల్ పై పెద్ద సంఖ్యలో బయటకు పంపిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న చిన్నమ్మ శశికళ, వదినమ్మ, ఇలవరసి, అబ్బాయి సుధాకర్ కు పెరోల్ అవకాశం లభించినా వారు ఉపయోగించుకోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయటి కంటే జైలులోనే ఉండటం మంచిదని భావించారేమో అనిపిస్తోంది.
అమ్మ మక్కల్ మున్నేట కళగం వర్గాలు చేపట్టిన పెరోల్ ప్రయత్నాలను వారు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో జైలు నుంచి 1,112 మంది ఖైదీలు తాత్కాలిక బెయిల్, పెరోల్ మీద వెళ్లడంతో జైలులో అనేక రూమ్స్, పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం. బెంగళూరు పరస్పర అగ్రహార జైలులో ఉన్న చిన్నమ్మ శశికళ మరియు బృందం ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో జైలులో మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తున్నారు.
చిన్నమ్మ శశికళ, ఇలవరసి సుధాకరన్ జైలులో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మాస్కులు ధరించడమే కాకుండా సామాజిక దూరం పాటిస్తున్నట్లు సమాచారం. భోజనం కోసం బారులు తీరాల్సిన పరిస్థితి లేకపోవడంతో తమకు కావాల్సింది తెచ్చుకుని తింటున్నారని సమాచారం. శశికళ ఉన్న గదిలో అంతకముందు ముగ్గురు ఉండగా, ఒకరు పెరోల్ మీద బయటకు వెళ్లడంతో ఇప్పుడు చిన్నమ్మ, ఇలవరసి మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.