Pegasus Row: కేంద్రంపై దీదీ ఫైర్.. నా ఫోన్ టాపింగ్ చేశారు.. అందుకే ప్లాస్టర్ వేశా!

కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. విపక్ష నేతల ఫోన్లను కేంద్రం హ్యాక్ చేస్తోందని మమతా ఆరోపించారు. రాష్ట్రాలకు నిధులివ్వరు కానీ స్పై వేర్ పై కోట్లు ఖర్చు చేస్తారని ఆమె విమర్శించారు.

Pegasus row – Mamata Banerjee attacks Centre : కేంద్ర ప్రభుత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. విపక్ష నేతల ఫోన్లను కేంద్రం హ్యాక్ చేస్తోందని మమతా ఆరోపించారు. రాష్ట్రాలకు నిధులివ్వరు కానీ స్పై వేర్ పై కోట్లు ఖర్చు చేస్తారని ఆమె విమర్శించారు. పెగాసస్ పై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని మమతా డిమాండ్ చేశారు. యూపీ బెస్ట్ స్టేట్ అని ప్రధాని నరేంద్ర మోదీ అనడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఫ్రంట్ గా ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యా చరణ కోసం ప్రతిపక్ష పార్టీల నేతలు ఢిల్లీకి రావాలని మమత తెలిపారు. 2024 ఎన్నికల లక్ష్యంగా ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలని మమతా కోరారు. నా ఫోన్ కూడా టాపింగ్ చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. తాను ఎవరితోనూ మాట్లాడటం లేదని, టాపింగ్ కు గురికాకుండా తన ఫోన్ కు ప్లాస్టర్ వేసినట్టు తెలిపారు. నేతలు, జడ్డీలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెగాసిస్ పై కేంద్రం డబ్బులు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. అలాగే ఢిల్లీలో జులై 27 లేదా 28 తేదీల్లో ప్రతిపక్ష పార్టీల భేటీ ఏర్పాటు చేయాలని, తాను హాజరుకానున్నట్టు మమత చెప్పారు.

ఇజ్రాయెల్ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ అత్యంత ప్రమాదకరమైనదిగా ఆమె వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయిందని, ఇప్పుడు తాను ఇతర ప్రతిపక్ష నాయకులతో గానీ, ప్రజలతో స్వేచ్ఛగా మాట్లాడలేనంటూ మమతా తెలిపారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టే దాకా ఖేలాహోబె దివ‌స్ జరపాలన్నారు. ఆగస్టు 16న అన్ని రాష్ట్రాల్లోను ఖేలా దివస్‌ నిర్వహించాలని దీదీ పిలుపునిచ్చారు.


పేద పిల్లలకు ఫుట్‌బాల్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇజ్రాయెల్‌కు చెందిన NSO గ్రూప్‌ రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌ పలువురు ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్‌ చేసిందన్న ఆరోపణలతో తీవ్రదుమారం రేపింది. ముఖ్యంగా జర్నలిస్టులు,హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలే ప్రధాన లక్ష్యంగా గూఢచర్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ట్రెండింగ్ వార్తలు