Heavy Snow Fall : జమ్మూకశ్మీర్ లో ముంచుకొచ్చిన మంచు ఉప్పెన

ఉత్తరభారతాన్ని మంచు గజ గజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలి గాలుల తీవ్రతకు ఉష్ణోగ్రతలు ఘనంగా పడిపోతున్నాయి. జమ్మూకశ్మీర్ లో మంచు ఉప్పెన ముంచుకొచ్చింది.

Heavy Snow Fall : ఉత్తరభారతాన్ని మంచు గజ గజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలి గాలుల తీవ్రతకు ఉష్ణోగ్రతలు ఘనంగా పడిపోతున్నాయి. జమ్మూకశ్మీర్ లో మంచు ఉప్పెన ముంచుకొచ్చింది. విపరీతంగా కురుస్తున్న మంచుతో జమ్మూకశ్మీర్ లోని ఎడాది తరుచూ అవలాంచులు ఏర్పడుతున్నాయి. ప్రముఖ హిల్ స్టేషన్ సోనామార్గ్ లో రెండు రోజుల క్రితం భారీ అవలాంచ్ ఏర్పడింది. తాజాగా అదే ప్రాంతంలో మరోసారి అంతకుమించిన అవలాంచు ఏర్పడింది.

దీంతో అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓ నిర్మాణ సంస్థ స్థానికంగా సొరంగ మార్గాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థకు చెందిన ఉద్యోగులు అదే ప్రాంతంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి సమీపంలో ఈ అవలాంచులు ఏర్పడంతో వారంతా భయంతో పరుగులు తీశారు. తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారంతా సురక్షితంగా ఉన్నట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ హర్ పాల్ వెల్లడించారు.

Srinagar Airport: శ్రీనగర్‌‌ ఎయిర్‌‌పోర్టులో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన విమానాలు

ఆ అవలాంచ్ కు సంబంధించిన వీడియో భయం గొల్పేలా ఉంది. నలువైపుల నుంచి మంచు కొండల మీద కురుస్తున్నట్లుగా ఉంది. దట్టమైన పొగ మంచు ఆ ప్రాంతమంతా నిండిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు గదుల నుంచి ఎవరూ బయటికి రావొద్దని అధికారులు సూచించారు.

ట్రెండింగ్ వార్తలు