Perni Nani: చెప్పుడు మాటలు విని టీచర్లు అసభ్యంగా మాట్లాడటం ధర్మమా?

ఉద్యోగ సంఘాలని సీఎస్ చర్చలకు పిలిచి మాట్లాడతారని చెప్పారు మంత్రి పేర్ని నాని.

Perni Nani: ఉద్యోగ సంఘాలని సీఎస్ చర్చలకు పిలిచి మాట్లాడతారని చెప్పారు మంత్రి పేర్ని నాని. సంప్రదింపులు చేసేందుకు ఎప్పుడూ తలుపులు తెలిచే ఉంటాయని మరోసారి స్పష్టం చేశారు పేర్ని నాని.

ఉద్యోగస్తులకు ఉన్న అనుమానాలు నివృత్తి చెయ్యడానికే చర్చలకు రమ్మని పిలుస్తున్నామని, ఉద్యోగులు విజ్ఞాన వంతులు అయినా కొందరి తప్పుడు ప్రచారాలు నమ్ముతున్నారని అభిప్రాయపడ్డారు పేర్ని నాని. ఎవరెన్ని అనుకున్నా సీఎం జగన్‌కి ఉద్యోగులకు మధ్య తగాదాలు పెట్టలేరన్నారు పేర్ని నాని.

చంద్రబాబు టీచర్ల గురించి, ఉద్యోగుల గురించి ఎలాంటి మాటలు అన్నాడో మర్చిపోలేదని, చంద్రబాబు టీచర్లను ఉద్యోగుల్ని లోపల వేసి కొట్టించలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబునే ఉద్యోగులు నమ్మే పరిస్థితి లేదని, నమ్మరని పునరుద్ఘాటించారు.

AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు

చెప్పుడు మాటలు విని సీఎంని ప్రభుత్వంని అసభ్యంగా మాట్లాడకండంటూ హితవు పలికారు. విద్య నేర్పే టీచర్లు అసభ్యంగా మాట్లాడటం ధర్మమా? అని ప్రశ్నించారు. ఇదేనా మీరు పిల్లలకి నేర్పించే పాఠాలు అని ప్రశ్నించారు. ఉద్యమం చెయ్యండి.. అది మీ హక్కు.. కానీ అసభ్యంగా మాట్లాడకండని అభ్యర్థించారు.

ట్రెండింగ్ వార్తలు