AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు

కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోదం లభించింది. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి కేబినెట్ ఆమోదం లభించింది.

AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు

Ap Cabinet

AP Cabinet Key decisions : ఏపీ కేబినెట్ కీలక పలు నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం లభించింది. ఉద్యోగుల పదవీవిమరణ వయసు 62 ఏళ్లకు పెంపుతోపాటు పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. శుక్రవారం(జనవరి21, 2022)న ఉదయం కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పీఆర్సీ వ్యవహారంపై చర్చించారు. ముందుగా ఇచ్చిన జీవోల ప్రకారమే…వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

దీంతోపాటు కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోదం లభించింది. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం లభించింది. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగోలకు కేటాయింపు, ఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపు, ఈబీసీ నేస్తం పథకం అమలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

AP Government : పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలకు ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు

45 ఏళ్లు దాటిన అగ్రవర్ణ పేద మహిళలకు ఏడాదికి రూ.15 వేలు పథకానికి ఆమోదం తెలిపింది. ఈ నెల 25న ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. వారానికి 4 సర్వీసులు నడిపేలా ఇండిగో ఎయిర్ లైన్స్ తో ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఏపీ ప్రభుత్వ సహకారంతో ఏడాదిపాటు అమలులో ఒప్పందం, 16 కొత్త మెడికల్ కాలేజీలకు రూ.7,880 కోట్లు మంజూరుకు ఆమోదించింది.

పాత మెడికల్ కాలేజీల అభివృద్ధికి రూ.3,500 కోట్లు మంజూరు, అర్హత ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయల్లోనూ ఉద్యోగ అవకాశాలు, తిరుపతిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం కిదాంబి శ్రీకాంత్ కు 5 ఎకరాల స్థలం కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామాల్లో ఓటీఎస్ ను 2 వాయిదాల్లో కట్టేలా చేసిన మార్పులకు ఆమోదం తెలిపింది. దీపావళి, ఉగాదికి కట్టేలా అవకాశం కల్పిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.