AP Government : పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలకు ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు

పీఆర్సీపై జరుగుతున్న వివాదానికి తెరదించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు.

AP Government : పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలకు ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు

Ap Govt

AP government committee : పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపడానికి ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ ఉన్నారు. పీఆర్సీపై జరుగుతున్న వివాదానికి తెరదించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. కేబినెట్ సమావేశంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు.

దీనికి సంబంధించి మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేసి, ఉద్యోగులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, వారికున్న సమస్యలపై చర్చించి పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. ఉద్యోగ సంఘాలు తెలుపుతున్న అభ్యంతరాలు, సమస్యలు, వాటి పరష్కార మార్గం దిశగా చూడాలని మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఆదేశించారు. దీంతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు మిగతా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసే దిశగా ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.

Tension In Gudivada : గుడివాడలో టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పర రాళ్ల దాడి.. ఉద్రిక్త వాతావరణం

శుక్రవారం (జనవరి 21, 2022) జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ (PRC GO)లను మంత్రిమండలి ఆమోదించింది. పీఆర్సీపై ఏపీ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. పీఆర్సీ జీవోలను కేబినెట్ ఆమోదించడంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కన్నెర్ర చేశాయి. ఇక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించాయి. ఈ రోజు 3 గంటలకు ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి ఉద్యోగ సంఘాలు సమ్మెకు వెళ్లాలనే యోచన చేశారు.

ఉద్యోగ సంఘాలు సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లనున్నారు. దాదాపు 16 సంఘాలు ఈరోజు సమావేశమైన దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 23న జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, 25న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు.., 26న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాల సమర్పణ, ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు, ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ వంటి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాయి.