Tension In Gudivada : గుడివాడలో టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పర రాళ్ల దాడి.. ఉద్రిక్త వాతావరణం

రాళ్ల దాడిలో టీడీపీ నేత బోంబా ఉమా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు రాళ్ల దాడిలో వైసీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

Tension In Gudivada : గుడివాడలో టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పర రాళ్ల దాడి.. ఉద్రిక్త వాతావరణం

Gudivada

TDP, YCP Activists attack each other : క్యాసినో రాజకీయాలు కృష్ణా జిల్లా గుడివాడ వీధులు రణరంగాన్ని తలపించాయి. క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడకు వెళ్లడం, దానికి నిరసనగా వైసీపీ శ్రేణులు తీసిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్లు విసురుకోవడంతో గుడివాడ వీధులు అట్టుడికి పోయాయి.

రాళ్ల దాడిలో టీడీపీ నేత బోండా ఉమా కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు రాళ్ల దాడిలో వైసీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసులే కారు అద్దాలు పగలగొట్టించారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇక పోటాపోటీ ర్యాలీల సమయంలో బోండా ఉమా సహా టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

Pakistan Pilot: డ్యూటీ టైం ముగిసిందని విమానాన్ని మధ్యలో వదిలేసి పోయిన పాకిస్తాన్ పైలట్

అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు తమను అడ్డుకోవడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ, వైసీపీ ర్యాలీలతో గుడివాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.