Pakistan Pilot: డ్యూటీ టైం ముగిసిందని విమానాన్ని మధ్యలో వదిలేసి పోయిన పాకిస్తాన్ పైలట్

డ్యూటీ టైం ముగిసిందంటు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA) కు చెందిన పైలట్ విమానాన్ని మధ్యలోనే వదిలెళ్లిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Pakistan Pilot: డ్యూటీ టైం ముగిసిందని విమానాన్ని మధ్యలో వదిలేసి పోయిన పాకిస్తాన్ పైలట్

Paki

Pakistan Pilot: పని వేళలను ఉద్యోగులు సీరియస్ గా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలిపే ఘటన ఇది. షిఫ్ట్ టైం ముగిశాక.. ఉద్యోగులు ఎలా ప్రవర్తిస్తారో చెప్పే ఘటన ఇది. ఒక విమాన పైలట్ అనూహ్య నిర్ణయం ప్రయాణికులకు శాపంగా మారిన ఘటన ఇది. తన డ్యూటీ టైం ముగిసిందంటు ఓ పైలట్ విమానాన్ని మధ్యలోనే వదిలెళ్లిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA) కు చెందిన ఆ పైలట్, విమాన ప్రయాణికులకు చుక్కలు చూపించాడు.

Also Read: Tiruchanur Temple: 50 ఏళ్ల తరువాత తిరుచానూరులో “నవకుండాత్మక శ్రీ‌యాగం”

వివరాల్లోకి వెళితే PIAకు చెందిన PK-9754 విమానం జనవరి 16న సౌదీఅరేబియాలోని రియాద్ నుంచి పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే మార్గమధ్యలో వాతావరణం సహకరించక విమానాన్ని సౌదీఅరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. తిరిగి ప్రయాణం కొనసాగించాల్సిన సమయానికి పైలట్ లలో ఒకరు తన షిఫ్ట్ టైం(పని సమయం) ముగిసిందని, విమానం నడిపేందుకు రాలేనని తాపీగా హోటల్ కు వెళ్ళిపోయాడు. దీంతో కంగుతిన్న కో-పైలట్ విషయాన్నీ PIA యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాడు.

Also read: Amar Jawan Torch: అమర్ జవాన్ జ్యోతిని ఆర్పడం లేదు, తరలిస్తున్నాం అంతే: కేంద్రం

ఇంతలో విమానంలోని ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ విమానం దిగబోమని, తమ గమ్యస్థానాలకు చేర్చాల్సిందే అంటూ పట్టుబట్టారు. పరిస్థితి చేయిదాటి పోతుండడంతో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అప్రమత్తం అయి.. ప్రయాణికులకు సర్ది చెప్పారు. అనంతరం వారందరికీ స్థానిక హోటల్ లో బస ఏర్పటుచేసి, పైలట్ తిరిగి వచ్చాక ప్రయాణం కొనసాగించారు. దీనిపై PIA సంస్థ ప్రతినిధి స్పందిస్తూ..పైలట్లకు విశ్రాంతి ఎంతో అవసరమని, తమ పైలట్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని వెనకేసుకొచ్చింది.

Also reaD: Ganjayi Smuggling: రూ.1.80 కోట్ల విలువచేసే 800 కిలోల గంజాయి స్వాధీనం