Kerala : ‘కర్ణుడి’ అవమానాలు ఎవరికీ వద్దు..గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరు అక్కర్లా..తల్లిపేరు చాలు : హైకోర్టు కీలక తీర్పు

గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరును తప్పనిసరి కాదు తల్లి పేరును మాత్రమే వెల్లడించే హక్కు ఎవరికైనా ఉంటుంది అంటూ కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం మహాభారతంలో ‘కర్ణుడు’ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. ఇకపై ఎవ్వరు ‘కర్ణుడిలా బాధపడవద్దని అవమానాలు భరించాల్సిన పనిలేదు గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరును పేర్కొనకుండా కేవలం తల్లి పేరును మాత్రమే వెల్లడించే హక్కు ఎవరికైనా ఉంటుందని స్పష్టం చేసింది.

Person Right To Only Mother's Name In Identity Documents

Person Right To Only Mother’s Name In Identity Documents : అవివాహిత మహిళల సంతానానికి ఉపశమనం కల్పిస్తూ కేరళ హైకోర్టు అత్యంత కీలక తీర్పును వెలువరించింది. గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరును తప్పనిసరి కాదు తల్లి పేరును మాత్రమే వెల్లడించే హక్కు ఎవరికైనా ఉంటుందు అని సుస్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేరళ హైకోర్టు జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ మహాభారతంలో ‘కర్ణుడు’ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎవ్వరు ‘కర్ణుడిలా బాధపడవద్దని అవమానాలు భరించాల్సిన పనిలేదు గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరును పేర్కొనకుండా కేవలం తల్లి పేరును మాత్రమే వెల్లడించే హక్కు ఎవరికైనా ఉంటుందని స్పష్టం చేసారు. సమాజంలో అవివాహిత మహిళలు, అత్యాచార బాధితుల పిల్లలకు ఎదురవుతున్న బాధలను గుర్తిస్తూ ఈ తీర్పును వెలువరించింది.

Also read : Living Together : దంపతులుగా జీవిస్తున్న జంట మధ్య మూడో వారి జోక్యం వద్దు-ఢిల్లీ హై కోర్టు

ఇంకా కోర్టు పలు వ్యాఖ్యలు చేస్తూ..‘తల్లిదండ్రులెవరో తెలియనందుకు జీవితాంతం దూషణలకు గురైన మహాభారతంలోని కర్ణుడి లాంటివారు మన సమాజంలో ఎవరూ ఉండకూడదని ఆకాంక్షిస్తున్నామని వెల్లడించింది. “కర్ణుడు” వంటి పాత్రలు లేని సమాజం మనకు కావాలి” అని తీర్పులో కోర్టు పేర్కొంది. జనన ధ్రువీకరణ పత్రం నుంచి తండ్రి పేరును తొలగించాలని కోరుతూ దాఖలైన ఓ రిట్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తల్లిపేరును మాత్రమే పేర్కొంటూ గుర్తింపు పత్రాన్ని జారీచేయాలని అధికారులను ఆదేశించారు.

Also read : Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!

అవివాహిత మహిళలకు పుట్టినవారు కేవలం ఆమె పిల్లలే కాకుండా ఈ మహోన్నత భారత దేశం బిడ్డలని..వారు కూడా ఈ దేశ పౌరులేనని స్పష్టం చేశారు. వారికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఎవరూ ఉల్లంఘించలేరని సుస్పష్టం చేశారు. వారి గోప్యత, గౌరవం, స్వేచ్ఛకు సంబంధించిన హక్కులను హరించడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. అవివాహిత తల్లులు..అత్యాచార బాధితురాలి పిల్లలు ఎదుర్కొంటున్న వేదనలను గుర్తించిన జస్టిస్ కూనికృష్ణన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also read : Delhi HC : భర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న మహిళలు..గృహహింస చట్టం దుర్వినియోగమవుతోందంటూ హైకోర్టు సీరియస్