Petrol Rate : పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో క్రమంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం దేశంలోని రిటెయిల్ మార్కెట్లో డీజిల్, పెట్రోల్ అమ్మకాలపై ఖశ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Petrol Rate : అంతర్జాతీయ మార్కెట్లో క్రమంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం దేశంలోని రిటెయిల్ మార్కెట్లో డీజిల్, పెట్రోల్ అమ్మకాలపై ఖశ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆయిల్ కంపెనీలు సంక్షోభం ఎదురుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Read More : Child Pornography : ఆ వీడియోలు చూస్తున్నారా..అయితే..జైలుకే

అయితే గత కొద్దీ రోజులుగా దేశంలో ఫ్యూయల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే దేశీయ రిటెయిల్ మార్కెట్లో ఫ్యూయల్ ధరలు పెంచక తప్పదని తెలుస్తోంది. ఇక గడిచిన నెల రోజుల్లో బ్యారెల్ చమురు ధర 4 నుంచి 6 డాలర్లు పెరిగింది. అయితే దేశీయంగా మాత్రం ఫ్యూయల్ ధరల్లో పెద్దగా హెచ్చుతగ్గులు కనిపించలేదు.

ఇక హైదరాబాద్ మార్కెట్లో పెట్రోల్ ధర రూ.105.26గా ఉండగా డీజిల్ ధర రూ.96.69గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.19 ఉండగా డీజిల్ ధర రూ.88.62గా ఉంది.

చమురు ధరలు పెరగడానికి మెక్సికో సముద్ర సమీపంలోని ఉత్తరమెరికాలో క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గింది. మరో వైపు ఇడా తుఫాను కారణంగా చమురు వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడటంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.

Read More : Today Gold Rate : శుభవార్త.. బంగారం ధర ఢమాల్‌

ట్రెండింగ్ వార్తలు