Petrol Rate : స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళ, బుధవారాల్లో దేశంలోని ఐదు ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు.

Petrol Rate : పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళ, బుధవారాల్లో దేశంలోని ఐదు ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు.. గత నెల చివరి వారం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలో పెట్రోల్ పై 75పై.. డీజిల్ పై రూ.1 వరకు తగ్గింది. వచ్చే నెలలో పెట్రోల్, డీజిల్ పై మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక దేశంలోని మెట్రో నగరాల్లోని పెట్రల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే

ఢిల్లీ పెట్రోల్ ధర రూ.101.19 ఉండగా.. డీజిల్ ధర రూ.88.62 గా ఉంది.
ముంబైలో పెట్రోల్ ధర రూ.107.26 ఉండగా.. డీజిల్ ధర రూ.96.19 గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా.. డీజిల్ ధర రూ. 93.26 గా ఉంది.
కోల్ కత్తా ధర రూ. 101.62 ఉండగా.. డీజిల్ ధర రూ. 91.71 గా ఉంది.
హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 105.26 ఉండగా.. డీజిల్ ధర రూ. 96.69 గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు