Petrol-Diesel Price : దేశంలో తగ్గని పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏడు రోజుల్లో ఆరోసారి పెంపు..!

Petrol-Diesel Prices :  దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఇందన ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

Petrol-Diesel Prices :  దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఇందన ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇటీవలే కేంద్రం, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన సంగతి తెలిసిందే. దాంతో పలు రాష్ట్రాల్లో ఇందన ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. ఎన్నికల సమయంలో భారీగా తగ్గిన ఇంధన ధరలు.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కసారిగా పెరిగాయి. కేంద్రం తగ్గించిన ఇందన ధరలు పెట్రోల్ రూ.6, డీజిల్ పై రూ.11 వరకు ధరలు దిగొచ్చాయి.

కానీ, గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు క్రమంగా కొనసాగుతోంది. పెట్రోల్‌పై 34 పెరగగా.. డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగింది. గడిచిన వారం రోజుల్లో 6 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గడిచిన ఏడు రోజుల్లో రూ.4.04, డీజిల్ పై రూ.4.13 వరకు పెరిగింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.71 పెరగగా.. డీజిల్ ధర రూ.99.08 వరకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ లీటర్ పెట్రోల్ ధర రూ.99.41 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.90.77గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

విదేశాల నుంచి 85శాతం చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. 2022, మార్చి 27వ తేదీ ఆదివారం పెట్రోల్‌పై 50 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంచుతూ చమురు విక్రయ సంస్థలు నిర్ణయించాయి. దేశంలో లీటర్ పెట్రోల్ రూ. 3.70, డీజిల్ రూ. 3.75 వరకు పెరిగింది. మార్చి 22వ తేదీ నుంచి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. వస్తున్నాయి. ఆదివారం (మార్చి 27) కోల్‌కతాలో పెట్రోల్ రూ.108.53 పైసలు, డీజిల్ రూ.93. 57 పైసలుగా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ రూ. 99 11 పైసలకు, డీజిల్ రూ. 90 42 పైసలకు చేరింది.

2022 ఏడాదిలో ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఆయిల్ కంపెనీలు ఇందన ధరలు పెంచలేదు. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీలకు దాదాపు రూ.19 వేల కోట్ల నష్టం వచ్చినట్టు తెలిపింది. యుక్రెయిన్, రష్యా యుద్ధంతో బ్యారెల్ చమురు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నష్టాలను సర్దుబాటు చేసేందుకు ఇలా ప్రతి రోజూ ఇందన ధరలు పెంచుతున్నట్టు తెలిసింది. యుక్రెయాన్ యుద్ధంతోనే పెట్రో ధరలు పెరుగుతున్నాయని కేంద్రం చెబుతోంది. దాదాపు 80 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు.

Read Also :  Petrol In India : కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే

ట్రెండింగ్ వార్తలు