Petrol Diesel : దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ తగ్గింపు

Petro, Diesel Rates: దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ ఇచ్చింది కేంద్రం.. పెట్రోల్, డీజిల్ ధరలపై భారీగా తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం

Petrol Diesel Price Drop: పెట్రోల్, డీజిల్ ధరలు మండుతున్న సమయంలో దీపావళి సందర్భంగా సామాన్య ప్రజలకు మోడీ ప్రభుత్వం గొప్ప ఉపశమనం కలిగించింది. మోడీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం బుధవారం(నవంబర్ 3, 2021) అర్థరాత్రి 12గంటలకు అంటే రేపటి నుంచి అమల్లోకి రానుంది.

కరోనా సెకండ్ వేవ్ నుంచి పెట్రోల్ రేట్లు దేశంలో భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పతనం అవుతున్నప్పటికీ.. దేశంలో మాత్రం ఆయిల్ కంపెనీలు రేట్లను భారీగా పెంచుతూ వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు గగ్గోలు పెట్టాయి. ఓ దశలో పెట్రోల్ రేట్లను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రం కూడా ఆలోచించింది.

దీనిపై ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు కూడా గత అక్టోబర్ లో పరిశీలన కోసం పంపించింది.   ఐతే.. ఆర్థిక శాఖ సున్నితంగా దీన్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో… ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఆయిల్ కంపెనీలతో ప్రధాని మోడీ గత నెలలో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో రిలయన్స్ అధిపతి ముఖేశ్ అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ చర్చలు ముగిసిన పది రోజుల్లోనే కేంద్రం ప్రజలకు తీపి కబురు అందించింది.

ట్రెండింగ్ వార్తలు