Pics Of Delhi Station Swanky Future Look
NDLS: దేశంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను అత్యుధునికంగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగా కొన్ని డిజైన్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. తాజాగా ఒక డిజైన్‌ను రైల్వే శాఖ శనివారం విడుదల చేసింది. భవిష్యత్తులో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఇలా ఉంటుందంటూ నెటిజెన్లకు తెలిపింది. అయితే రైల్వే శాఖ విడుదల చేసిన ఈ డిజైన్ ఇప్పటికైతే ఫైనల్ కాలేదు. కాకపోతే ప్రస్తుతానికైతే ఈ డిజైన్‌పై ప్రభుత్వం కాస్త మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ డిజైన్‌కు సంబంధించి రెండు చిత్రాలను రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘కొత్త యుగానికి గుర్తు: పున: అభివృద్ధి చేయబోయే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రతిపాదిత రూపకల్పన’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చివరలో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కోడ్ NDLSను జత చేశారు. ఈ చిత్రాల్లో కనిపిస్తున్న దాని ప్రకారం.. రెండు డోమ్ వంటి భారీ నిర్మాణాలు ఉన్నాయి. ఇవి రెండూ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాలని ఇమేజ్ చూస్తే తెలుస్తోంది. భవనాలపై విస్తారమైన గాజు వాడకం కనిపిస్తుంది.
Marking a New Era: Proposed design of the to-be redeveloped New Delhi Railway Station (NDLS). pic.twitter.com/i2Fll1WG59
— Ministry of Railways (@RailMinIndia) September 3, 2022
ఇక రైల్వే స్టేషన్ చుట్టూ భారీ స్థాయిలో ఫ్లైఓవర్లు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్‌కు సులభంగా చేరుకునేందుకు, రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వీటిని నిర్మించబోతున్నారట. ఇక స్టేషన్ సమీప ప్రాంతాన్ని పచ్చదనంతో నింపివేయనున్నారు. ఇదిలా ఉంటే.. నెటిజెన్లు కొంత మంది ఈ ప్రతిపాదనలపై మండిపడుతున్నారు. ఇంత భారీ స్థాయిలో భవనాలు తర్వాత కట్టొచ్చు కానీ ముందు రైళ్ల సమయపాలన, రైల్వే ప్రాయాణికులు సౌకర్యలు లాంటి వాటి గురించి కాస్తైనా ఆలోచించండంటూ సలహాలు ఇస్తున్నారు.
Narottam Mishra: షబానా అజ్మి, నసీరుద్దీన్ షాలపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు