పార్లమెంట్ సమావేశాలకు సరైన సమయానికి హాజరు కావాలనే ఉద్దేశ్యంతో కేంద్రమంత్రి పియూష్ గోయల్ పరుగులు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమయం మించిపోతున్న కారణంగా హడావుడిగా మంత్రి పరుగులు పెట్టడంపై నెటిజన్లు ఆయనను పొగడ్లలతో ముంచెత్తుతున్నారు.
మంత్రి పీయూష్ గోయల్ ఆలస్యంగా వెళ్లినా అనేవారు ఎవరు ఉండరు. అసలు పార్లమెంట్‌కు వెళ్లకుండా ఉన్నా కూడా అడిగే వారు ఎవరు ఉండరు.అయినా కూడా మంత్రి మాత్రం చాలా సిన్సియర్‌గా పార్లమెంట్‌కు హాజరు అవ్వడం, అది కూడా ఆలస్యం అవుతుందని బుధవారం పార్లమెంట్ ఆవరణలో పరుగులు పెట్టడం హడావుడిగా పరుగులు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది.
బుధవారం కేబినెట్ భేటీ తర్వాత ,క్వచ్చన్ అవర్ మిస్ అవకూడదని పియూష్ గోయల్ పార్లమెంట్ లోపలికి పరుగులు పెడుతున్న ఫొటోలను చూసిన పలువురు నెటిజన్లు తమ స్కూల్,కాలేజీ రోజులు గుర్తుచేసుకుంటున్నారు. మంత్రిగారి కమిట్ మెంట్ ప్రశంసనీయమైనదని మరికొందరు కామెంట్స్ చేయగా,రోల్ మోడల్,కమిట్ మెంట్ కు డెఫినీషన్ అంటూ మరికొందరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Minister @PiyushGoyal ji running to attend question hour on time after the cabinet meeting. pic.twitter.com/RpDb3FxQy6
— Suresh Nakhua ?? ( सुरेश नाखुआ ) (@SureshNakhua) December 4, 2019