జూన్ 1నుంచి తెరుచుకోనున్న ప్రార్ధనా మందిరాలు

  • Publish Date - May 29, 2020 / 01:35 PM IST

కేంద్ర ప్రభుత్వం విధించిన కరోనా లాక్ డౌన్-4  గడువు మే31, ఆదివారంతో ముగియనుంది. లాక్ డౌన్ 5 లో కేంద్రం పలు రంగాలకు సడలింపులివ్వనుందని అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు.ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రం లోని అన్ని ప్రార్ధనాలయాలు….దేవాలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాల్లో దర్శనాలు  తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. 

అయితే … ప్రార్ధనాలయాలు కొన్నినియమ నిబంధనలు పాటించాలనే షరతు విధించారు మమతా బెనర్జీ. ఏ మ‌తానికి సంబంధించిన ప్రార్థ‌నా మందిరం లోప‌లికి అయినా 10 మందికి మించి వెళ్ల‌కూడ‌ద‌న్నారు. లోప‌లికి వెళ్లిన 10 మంది తిరిగి వ‌చ్చిన త‌ర్వాత‌నే మ‌రో 10 మంది  లోపలకు వెళ్లాల‌ని సూచించారు. జూన్ 1 నుంచి తాజా స‌డ‌లింపులు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని సీఎం మ‌మ‌త స్ప‌ష్టం చేశారు.