కేంద్రం రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరణ చేసే క్రమంలో ముందుగా వేలానికి పెట్టేయాలని ప్లాన్ చేస్తుంది. 151ప్యాసింజర్ రైళ్లను ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పీయూశ్ గోయెల్ సోమవారం వెల్లడించారు. మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎమ్సీసీఐ)లు నిర్వహించిన వెబినార్ లో కేంద్ర మంత్రి మాట్లాడారు. అందరి నుంచి మంచి రెస్పాన్స్ అందుతుందని ఆయన అన్నారు.
ఇదంతా ఎప్పుడో జరిగేదని.. COVID-19మహమ్మారి కారణంగా కాస్త ఆలస్యమైంది. రైల్వే స్టేషన్లను మోడరనైజ్ చేయాలనుకోవడంలోదే ఈ ప్లాన్. ప్రైవేట్ వ్యక్తులకు ఈ ప్రాజెక్ట్ అప్పగించనున్నాం. ఈ మొత్తానికి కావాలసిన భూభాగాన్ని వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది.
కోల్‌కతాలో మెట్రో సర్వీసులు మళ్లీ ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనుమతికోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ‘కానీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో విమాన, సబర్బన్ రైల్వే సర్వీసులు జరగడానికి వ్యతిరేకంగా ఉన్నారు. మెట్రో సర్వీసులు స్టార్ట్ అయితే పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉంది’ అని గోయెల్ స్పష్టం చేశారు.