PM Modi: దీపావళికి రెండు రోజుల పాటు దీపాలు వెలిగించండి.. – మోదీ

ప్రధాని మోదీ దీపావళి పండుగ సందర్భంగా ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన్ (పీఎంఏవై) పథక లబ్ధిదారులైన 9లక్షల మంది, అయోధ్యలో ఉన్న 7.5లక్షల మంది దీపాలు..

PM Modi: దీపావళికి రెండు రోజుల పాటు దీపాలు వెలిగించండి.. – మోదీ

Pm Modi

Updated On : October 6, 2021 / 9:04 AM IST

PM Modi: ప్రధాని మోదీ దీపావళి పండుగ సందర్భంగా ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన్ (పీఎంఏవై) పథక లబ్ధిదారులైన 9లక్షల మంది, అయోధ్యలో ఉన్న 7.5లక్షల మంది దీపాలు వెలిగిస్తే రామ భగవానుడు సంతోషిస్తాడని అన్నారు.

ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అయోధ్యలో దీపాలతోనే దీపావళి సెలబ్రేషన్ జరుగుతుంది. ఇది ఐదో దీపోత్సవం కాగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం ఏర్పాట్లు మొదలుపెట్టేసింది.

‘మీకొక టాస్క్ ఇస్తున్నా. ఉత్తరప్రదేశ్ లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 9లక్షల మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. వీరంతా రెండు రోజుల పాటు దీపాలు వెలిగించండి. అలా దీపావళి పండుగకు 18లక్షల దీపాలు వెలుగుతాయి. అయోద్యలో 7.5లక్షల దీపాలు వెలిగిస్తే రామ భగవానుడు సంతోషిస్తాడు’ అని ప్రధాని అన్నారు.

………………………………………….: వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్‌గా స్మృతి మంధాన