దేశ ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో తనకు తెలుసునని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారని, లాక్ డౌన్ కష్టాలు తట్టుకుంటూ.. కరోనాపై పోరాటంలో మనం సరైన మార్గంలోనే వెళ్తున్నాం అని అన్నారు ప్రధాని మోడీ.
అయితే కరోనా మాత్రం దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని ఇటువంటి సమయంలో కరోనాపై పోరులో మనం పెట్టుకున్న 21రోజులు లాక్ డౌన్ మళ్లీ పొడిగించుకోవలసిన అవసరం ఉందని అన్నారు మోడీ. అందులో భాగంగానే మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని మోడీ.
కరోనాపై పోరాటంలో దేశమంతా ప్రతి ఒక్కరు సైనికులులా పనిచేస్తున్నారని, ఇలాగే పోరాటం కొనసాగించవలసిన అవసరం ఉందని అన్నారు మోడీ. ఇప్పటికే దేశంలో 10వేల కేసులు నమోదు కాగా ఇంకా మనం అప్రమత్తంగా వ్యవహిరించాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రధాని మోడీ.