Prahlad Modi
PM Modi Brother Prahlad Modi: ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ అస్వస్థతకు గురయ్యాడు. ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయినట్లు తెలిసింది. ప్రహ్లాద్ ప్రధాని మోదీకి తమ్ముడు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. మంగళవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయినట్లు తెలిసింది. గతేడాది డిసెంబర్ నెలలో మైసూరులో ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో వీరిని నగరంలోని జేఎస్ఎస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన విషయం విధితమే.
Modi’s Brother Injured: రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోదీ సోదరుడు, కుటుంబ సభ్యులకు గాయాలు
ప్రధాని నరేంద్ర మోదీకి నలుగురు సోదరులు సోమ మోదీ, అమృత్ మోదీ, పంకజ్ మోదీ, ప్రహ్లాద్ మోదీ. సోదరి వాసంతి మోదీలు. ప్రస్తుతం కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరిన ప్రహ్లాద్ మోదీ నాలుగో వ్యక్తి. మోదీ కంటే రెండేళ్లు చిన్నవాడు. ఆయన అహ్మదాబాద్‌లో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తుంటారు. అంతేకాక నగరంలో టైర్ షోరూం కూడా నిర్వహిస్తున్నాడు. మోదీకి వాసంతీబెన్ అనే సోదరి ఉంది. ఆమె గృహిణి. ఆమె భర్త హస్ముఖ్ భాయ్. ఎల్ఐసీలో పనిచేస్తున్నాడు.
ప్రధాని మోదీకి మరో సోదరుడు సోమ మోదీ. ఆరోగ్యశాఖ నుంచి పదవీ విరమణ అనంతరం అహ్మదాబాద్‌లో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. మోదీకి అతను పెద్ద అన్నయ్య. మోదీ మరో అన్నయ్య అమృత్ మోదీ. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మెషిన్ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం పదవీ విరమణ చేసి అహ్మదాబాద్ లో నివాసం ఉంటున్నాడు. నరేంద్ర మోదీ మరో తమ్ముడు పంకజ్ భాయ్ మోదీ.. ఆయన గాంధీనగర్ లో నివసిస్తున్నారు. అతని భార్య పేరు సీతాబెన్. పంకజ్ భాయ్ కుటుంబం తల్లి హీరాబెన్‌తో కలిసి నివసించారు. తల్లిని కలిసేందుకు మోదీ అప్పుడప్పుడు అక్కడికి వెళ్లేవాడు.