NEP 2020: జాతీయ నూతన విద్యా విధానం అందుకే తెచ్చాం.. వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని మోదీ

2014 నుంచి దేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్, వైద్య కళాశాలల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగినట్లు మోదీ తెలిపారు. ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి భారీ విద్యా సంస్థల సంఖ్య పెరుగుతోందని గుర్తు చేశారు. 2014 తర్వాత వైద్య కళాశాలల సంఖ్య 65 శాతం కన్నా ఎక్కువగా పెరిగిందని అన్నారు.

NEP 2020: కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే తీసుకువచ్చిన జాతీయ నూతన విద్యా విధానంపై ప్రధానమంత్రి మరోసారి క్లారిటీ ఇచ్చారు. దేశంలో దూరదృష్టిగల, భావి తరాలకు ఉపయోగపడే విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టం చేశారు. శనివారం రాజ్‌కోట్‌లోని శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ సంస్థాన్ 75వ అమృత మహోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వర్చువల్ విధానంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కువ కాలం ప్రయోజనకరంగా, భవిష్యత్తుకు ఉపయోగకరమైన విద్యా విధానాన్నే కేంద్రం తీసుకువచ్చిందని మోదీ అన్నారు.

JDS: ఎన్ని లోన్లైనా తీసుకోండి, మేం అధికారంలోకి రాగానే అన్నీ మాఫీ చేస్తాం.. ఓటర్లకు జేడీఎస్ హామీ

2014 నుంచి దేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్, వైద్య కళాశాలల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగినట్లు మోదీ తెలిపారు. ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి భారీ విద్యా సంస్థల సంఖ్య పెరుగుతోందని గుర్తు చేశారు. 2014 తర్వాత వైద్య కళాశాలల సంఖ్య 65 శాతం కన్నా ఎక్కువగా పెరిగిందని అన్నారు. నూతన విద్యా విధానం ద్వారా దూరదృష్టిగల విద్యా వ్యవస్థను రూపొందించడం మన దేశంలో మొదటిసారని తెలిపారు. భారత దేశ భవిష్యత్తు కాంతులీనాలంటే మన ప్రస్తుత విద్యా విధానం, విద్యా సంస్థలు గొప్ప పాత్ర పోషించవలసి ఉంటుందని, అందులో భాగంగానే నూతన విద్యా విధానం అవసరమని తెలిపారు. స్వాతంత్ర్యం లభించిన అమృత కాలంలో విద్యా సంబంధిత మౌలిక సదుపాయాలను, విద్యా విధానాన్ని అత్యంత వేగంగా విస్తరిస్తున్నామని మోదీ చెప్పుకొచ్చారు.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కమల్ హాసన్.. రాహుల్‭తో కలిసి ఎర్రకోటవైపు అడుగులు

ట్రెండింగ్ వార్తలు