ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ యువతకు ఫిట్‌గా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ‘ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ఫిట్‌నెస్ అండ్ సక్సెస్…’ అంటూ ప్రసంగించారు. ‘ఒక్కసారి మీ శరీరానికి అవకాశం ఇచ్చి చూడండి. అదే మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది. నా పర్సనల్ అనుభవంతో చెప్తున్నా. మీలో కాన్ఫిడెన్స్, వ్యక్తిత్వం అన్నింటా మార్పును తీసుకొస్తుంది. సక్సెస్, ఫిట్‌నెస్ అనేవి ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. ఏ రంగంలోనైనా ఇది స్పష్టంగా కనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. 

న్యూ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా ఫిట్‌నెస్‌తో ఉంటామనే ప్రతిజ్ఞను చేయించారు. ఇటీవల జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఫిట్ ఇండియా మూమెంట్ గురించి దేశ ప్రజలకు తెలియజేశారు. 

నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఆగష్టు 29నే ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్లు వెల్లడించారు. మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఈ రోజును క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. 

ఆగష్టు 25న చేసిన ట్వీట్‌లో మోడీ ఈ విధంగా పేర్కొన్నారు.  ‘ఈ రోజు మన్ కీ బాత్ సందర్భంగా, తోటి భారతీయులకు రిక్వెస్టు చేస్తున్నాను. బాపు తన 150వ పుట్టినరోజు సందర్భంగా చక్కటి ప్రదేశాల్లో పర్యటించండి. ప్రకృతి, వన్యప్రాణులకు సంబంధించిన ప్రదేశాల్లో తిరగండి. పోషన్ అభియాన్‌ను బలోపేతం చేస్తూ.. ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగం అవ్వండి’ అంటూ ట్వీట్ చేశాడు.