Chintan Shivir: ఒక దేశం-ఒక పోలీస్ యూనిఫాం.. నూతన ప్రతిపాదన చేసిన ప్రధాని మోదీ

నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని, ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ మధ్య సమన్వయం అవసరమని మోదీ పిలుపునిచ్చారు. పోలీస్ వ్యవస్థలో ఒక ఉమ్మడి విధానం నెలకొంటే అంతర్రాష్ట్ర నేరాలను సులువుగా కట్టడి చేయవచ్చని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, హోం మంత్రులు పాల్గొన్నారు

Chintan Shivir: ‘ఒకే దేశం-ఒకే పోలీస్ యూనిఫాం’ అని కొత్త ప్రతిపాదన చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. శుక్రవారం హర్యానాలోని సూరజ్‭కుండులో ఏర్పాటు చేసిన చింతన్ శివిర్‭ కార్యక్రమాన్ని ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి సహా, రాష్ట్రాల హోంమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరైన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. శాంతిభద్రతల పరిరక్షణ రాష్ట్రాల బాధ్యతే అయినప్పటికీ.. దీనికి దేశ సమైక్యతో సంబంధం ఉందని మోదీ అన్నారు.

వాస్తవానికి ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన పోలీస్ యూనిఫాం ఉంటుంది. పోలీస్ వ్యవస్థ పూర్తిగా రాష్ట్రాల చేత్తుల్లో ఉండడం వల్ల.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనల మేరకు యూనిఫాం ఏర్పడింది. అయితే ఇలా భిన్నంగా కాకుండా.. దేశం మొత్తం ఒకే యూనిఫాం ఉండేలా చూస్తూ బాగుంటుందని ప్రధాని మోదీ సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలు ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవచ్చునని, పరస్పరం ప్రేరణ పొందవచ్చునని, కలిసికట్టుగా దేశ అభివృద్ధి కోసం పాటుపడవచ్చునని తెలిపారు.

నేరాలు అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి చేరుతున్నాయని, ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ మధ్య సమన్వయం అవసరమని మోదీ పిలుపునిచ్చారు. పోలీస్ వ్యవస్థలో ఒక ఉమ్మడి విధానం నెలకొంటే అంతర్రాష్ట్ర నేరాలను సులువుగా కట్టడి చేయవచ్చని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాల్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, హోం మంత్రులు పాల్గొన్నారు. అమిత్ షా గురువారం ఈ సమావేశాల్లో మాట్లాడుతూ దేశం ముందు ఉన్న సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల వ్యాప్తి, క్రాస్ బోర్డర్ టెర్రరిజం వంటి సవాళ్ళను ఎదుర్కొనడం కోసం ఉమ్మడి వేదికను ఈ సదస్సు అందజేస్తుందని చెప్పారు.

Imran Khan: యాత్ర ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్.. తొలి ప్రసంగంలోనే ఇండియాపై ప్రశంసలు

ట్రెండింగ్ వార్తలు