రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు.. రూ .17 వేల కోట్లు విడుదల

  • Publish Date - August 9, 2020 / 02:07 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా లక్ష కోట్ల ఫైనాన్సింగ్ సదుపాయాన్ని ప్రారంభించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రాయితీ రుణాలు ఇవ్వడానికి రూ .1 లక్ష కోట్ల కార్పస్‌తో అగ్రి-ఇన్‌ఫ్రా ఫండ్ ఏర్పాటుకు ప్రభుత్వం జూలైలో ఆమోదం తెలిపింది.

ఇక ‘పిఎం-కిసాన్ యోజన’ కింద 8.5 కోట్ల మంది రైతుల ఖాతాలకు రూ .17 వేల కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా ఆరవ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో పడ్డాయి. గత ఏడాదిన్నర కాలంలో 75 వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయగా.. ఇందులో కరోనా లాక్డౌన్ సమయంలో రైతులకు 22 వేల కోట్ల రూపాయలు అందజేశారు. గత ఏడేళ్లుగా పనులు జరుగుతున్న ఒక దేశం, ఒక మార్కెట్ మిషన్ ఇప్పుడు పూర్తి కాబోతుంది.

వీడియో కాన్ఫరెన్స్‌లో యూరియాను అధికంగా వాడటంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ప్రతినిధులతో జరిపిన సంభాషణలో యూరియాను అధికంగా వాడటం వల్ల భూమికి నష్టం జరుగుతోందని, దీనిపై రైతులు ఆలోచించాలని కోరారు.