US singer Mary Millben : ప్రధాని మోదీకి యూఎస్ గాయకురాలు మేరీ మిల్‌బెన్ మరోసారి ప్రశంసలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యూఎస్ గాయకురాలు మేరీ మిల్‌బెన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ భారతీయ పౌరుల పురోగతికి, మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఆఫ్రికన్-అమెరికన్ నటి,గాయని మేరీ మిల్‌బెన్ ప్రశంసించారు.....

Modi,US singer Mary Millben

US singer Mary Millben : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యూఎస్ గాయకురాలు మేరీ మిల్‌బెన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ భారతీయ పౌరుల పురోగతికి, మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నారని ఆఫ్రికన్-అమెరికన్ నటి,గాయని మేరీ మిల్‌బెన్ ప్రశంసించారు. జనాభా నియంత్రణలో విద్య,మహిళల పాత్రను వివరిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర అసెంబ్లీలో కించపరిచే పదజాలాన్ని ఉపయోగించిన సందర్భంగా మిల్‌బెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ అత్యుత్తమ నాయకుడు

2024 ఎన్నికల సీజన్ ప్రపంచవ్యాప్తంగా అమెరికా,భారతదేశంలో ప్రారంభమైందని మిల్‌బెన్ చెప్పారు. ‘‘ప్రధాని మోదీకి నేను ఎందుకు మద్దతు ఇస్తున్నాను అంటే భారతదేశ వ్యవహారాలను చాలా దగ్గరగా అనుసరిస్తున్నాను నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను… భారతీయ పౌరుల పురోగతికి ప్రధాని మోదీ అత్యుత్తమ నాయకుడు అని నేను నమ్ముతున్నాను. యూఎస్-ఇండియా సంబంధాలకు ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మోదీ ఉత్తమ నాయకుడు… మహిళల కోసం ప్రధానమంత్రి మోదీ నిలుస్తారు’’ అని మిల్ బెన్ వ్యాఖ్యానించారు.

సీఎం నితీష్ కుమార్ పై మండిపడిన యూఎస్ సింగర్ 

బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన అవమానకర వ్యాఖ్యలపై మిల్‌బెన్ మండిపడ్డారు. బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహించడానికి ఒక మహిళకు అధికారం ఇవ్వాలని ఆమె సూచించారు. జనాభా నియంత్రణకు సంబంధించి మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన నితీష్ కుమార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దాడి ప్రారంభించారు. నితీష్ రాష్ట్ర అసెంబ్లీలో చెత్త మాటలు మాట్లాడారని, ఆయనకు సిగ్గు లేదని మోదీ అన్నారు.

Also Read : బంగారం కొంటున్నారా.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ నితీశ్‌ కుమార్‌ పేరును ప్రస్తావించకుండా మంగళవారం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. బీహార్ ముఖ్యమంత్రి మంగళవారం రాష్ట్ర అసెంబ్లీలో కించపరిచే పదజాలంతో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో నితీష్ కుమార్ బుధవారం క్షమాపణలు చెప్పారు.

Also Read : Mahua Moitra : మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయండి… ఎథిక్స్ ప్యానెల్ సంచలన సూచన

తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘‘నా మాటలు తప్పుగా ఉంటే, అందుకు క్షమాపణలు కోరుతున్నాను. నా మాటల వల్ల ఎవరైనా బాధపడితే వాటిని వెనక్కి తీసుకుంటాను’’ అని కుమార్ విలేకరులతో అన్నారు. నితీష్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్రెండింగ్ వార్తలు