PM Modi
Rozgar Mela : రోజ్‌గార్ మేళాలో భాగంగా సోమవారం సీఏపీఎఫ్ లో కొత్తగా చేరిన 51వేలమంది అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ లెటర్లు అందించారు. ప్రధానమంత్రి రోజ్ గార్ మేళా 8వ ఎడిషన్‌ను మోదీ సోమవారం ప్రారంభించారు. దేశంలోని 45 ప్రాంతాల్లో వర్చువల్‌గా మోదీ మాట్లాడారు.
మిషన్ రిక్రూట్‌మెంట్ కింద భారత ప్రభుత్వం, కొన్ని రాష్ట్రాలు, యూటీలు దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేళాలను నిర్వహించాయి. (PM Modi To Distribute Over 51,000 Appointment Letters) ప్రతి నెలా లక్షలాది మంది యువతకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేస్తున్నాయి. రోజ్‌గార్ మేళా ఈవెంట్‌ల శ్రేణిలో భాగంగా సోమవారం కొత్త నియామకాలకు 51,106 అపాయింట్‌మెంట్ లెటర్‌ల పంపిణీ కోసం దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
Neeraj Chopra : ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు మరో బంగారుపతకం
గౌహతిలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖలు రోజ్‌గర్ మేళాలో పాల్గొన్నాయి. పెట్రోలియం, సహజ వాయువు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి క్యాచర్ జిల్లాలోని సిల్చార్ సమీపంలోని మసింపూర్ లో పాల్గొన్నారు.