All-Party Meeting : మోదీ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్!

నవంబర్-29నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం(నవంబర్-28)ప్రధాని మోదీ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది.

Modi (2)

All-Party Meeting  నవంబర్-29నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం(నవంబర్-28)ప్రధాని మోదీ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఆదివారం ఉదయం 11గంటలకు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో సాగు చట్టాల రద్దు,కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్ సహా పలు కీలక అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం.

ఇక,అదే రోజు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరగనుంది. ఎన్డీయే ఫ్లోర్ లీడర్లందూ ఆదివారం మధ్యాహ్నాం 3 గంటలకు సమావేశమవనున్నారు. ఈ మీటింగ్స్ కు కూడా మోదీ హాజరుకానున్నట్లు సమాచారం.

మరోవైపు,మోదీ గత వారం ప్రకటించిన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది

ALSO READ Bigg Boss 5: జెస్సీ హెల్త్ ప్రాబ్లమ్ ఎలిమినేషన్.. స్క్రిప్ట్ ప్రకారమే చేశారా?