G-20 Summit : ఇటలీకి మోదీ..పోప్ ఫ్రాన్సిస్ తో భేటీ

మరికొన్ని గంటల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐదు రోజుల యూరప్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఇవాళ రాత్రి భారత్ నుంచి బయల్దేరి..రేపు ఉదయం ఇటలీ చేరుకోకున్నారు మోదీ. ఇటలీ ప్రధాని

G-20 Summit  మరికొన్ని గంటల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐదు రోజుల యూరప్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఇవాళ రాత్రి భారత్ నుంచి బయల్దేరి..రేపు ఉదయం ఇటలీ చేరుకోకున్నారు మోదీ. ఇటలీ ప్రధాని మారియో ద్రాగి ఆహ్వానం మేరకు అక్టోబర్-29 నుంచి అక్టోబర్-31 వరకు రోమ్ లో జరుగనున్న 16వ జీ-20 శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు.

అయితే ప్రధాని మోదీ తన ఇటలీ పర్యటనలో భాగంగా..వాటికన్ లో పోప్ ప్రాన్సిస్ ని కలవనున్నారని గురువారం భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్థన్ స్రింఘాలా తెలిపారు. అయితే ఇది వన్ టూ వన్ మీటింగ్ గా లేక ప్రతినిధుల స్థాయి మీటింగా అన్నది ఇంకా ఫైనల్ కాలేదని హర్ష్ వర్థన్ స్రింఘాలా తెలిపారు. ప్రధాని తన యూరప్ పర్యటనలో పలువురు విదేశీ నేతలను కలవనున్నారని తెలిపారు.

కాగా, అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ-20 ప్రధాన ప్రపంచ వేదికగా అవతరించిందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ జీడీపీలో 80శాతం జీ-20 నుంచే ఉంటుందని,మొత్తం ప్రపంచ వ్యాణిజ్యంలో 75శాతం,ప్రపంచ జనాభాలో 60శాతం జీ-20 దేశాలు కలిగి ఉన్నాయని హర్ష్ వర్థన్ స్రింఘాలా తెలిపారు. అంతర్జాతీయ సహకారాలకు సంబంధించి జీ 20 ముఖ్యమైన ప్రపంచ వేదికగా మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక స్థిరత్వం,ఆరోగ్యం, ఆహార భద్రత వంటి మొదలగు రంగాలలో పౌరుల జీవన నాణ్యతపై ప్రత్యక్ష మరియు స్పష్టమైన ప్రభావాన్ని చూపే విధాన సమస్యలపై మార్పిడి, ఆవిష్కరణల కోసం ఒక ముఖ్యమైన వేదికగా ఉద్భవించిందనా తెలిపారు. అయితే ఈ సమావేశం… ప్రధాని మోదీ పాల్గొనే ఎనిమిదవ జీ20 శిఖరాగ్ర సమావేశం. భారతదేశంలో 2023 లో మొదటిసారి జి -20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది.

మరోవైపు,ఇటలీ పర్యటన అనంతరం ప్రధాని మోదీ బ్రిటన్ వెళ్లనున్నారు. నవంబరు 1-2తేదీల్లో బ్రిటన్ లోని గ్లాస్​గౌలో జరిగే కాప్​-26 ప్రపంచ నేతల సదస్సులో మోదీ పాల్గొంటారు. బ్రిటన్​ ప్రధాని బోరీస్ జాన్సన్ ఆహ్వానం మేరకు మోదీ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అక్టోబరు 31 నుంచి నవంబరు 12 వరకు కాప్-26 సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ నేతల సదస్సు నవంబరు 1-2 తేదీల్లో జరగనుంది. 120పైగా దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సుకు ఇటలీ, బ్రిటన్ అధ్యక్షత వహించనున్నాయి.

ALSO READ Covid Variant AY.4.2 : 5 రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు..థర్డ్ వేవ్ సంకేతమా!

ట్రెండింగ్ వార్తలు