PM Modi : కేదార్‌నాథ్‌లో ఆదిశంక‌రాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ

నవంబరు 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేదార్‌నాథ్‌లో పర్యటిస్తారు. కేదార్‌నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం మోదీ.. అక్క‌డ పున‌ర్నిర్మించిన శ్రీ ఆదిశంక‌రాచార్య

Pm Modi

PM Modi నవంబరు 5న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేదార్‌నాథ్‌లో పర్యటిస్తారు. కేదార్‌నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం మోదీ.. అక్క‌డ పున‌ర్నిర్మించిన శ్రీ ఆదిశంక‌రాచార్య స‌మాధికి ప్రారంభోత్సవం తర్వాత ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్ర‌ధాని కార్యాల‌యం తెలిపింది.

కేదార్‌నాథ్‌లోని ఆదిశంకరాచార్యుడి స‌మాధి 2013లో వ‌చ్చిన భారీ వ‌ర‌ద‌ల వ‌ల్ల ధ్వంస‌మైంది. 2013నాటి వరదల్లో దెబ్బతిన్న ఈ సమాధిని మోదీ పర్యవేక్షణలో పునర్నిర్మించారు. కాగా, మైసూరులో తయారుచేయబడిన ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని చినూక్ హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

ఇక,కేదార్ నాథ్ పర్యటనలో భాగంగా సరస్వతి ఆస్థా పథ్ (విశ్వాస మార్గం) వెంబడి జరుగుతున్న పనులను మోదీ సమీక్షిస్తారు. సరస్వతి రిటెయినింగ్ వాల్ ఆస్థా పథ్, స్నాన ఘట్టాలు, మందాకిని రిటెయినింగ్ వాల్ ఆస్థా పథ్, తీర్థ పురోహితుల ఇళ్ళు, మందాకిని నదిపై గరుడ్ ఛట్టి వంతెన సహా ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. రూ.130 కోట్లతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేశారు.

అదేవిధంగా మ‌రో రూ.180 కోట్ల అంచ‌నా వ్య‌యంతో నిర్మించ‌త‌ల‌పెట్టిన ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌కు మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అనంతరం మోదీ ఓ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

ALSO READ Kim Jong Un : నో బాడీ డబుల్..20 కిలోల బరువు తగ్గిన కిమ్