స్వామి వివేకానందకు ప్రధాని మోడీ నివాళి

వెస్ట్ బెంగాల్ లో ప్రధాని మోడీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. హౌరాకు వెళ్లిన ప్రధాని.. అక్కడ బేళూర్ మఠాన్ని సందర్శించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా

  • Publish Date - January 12, 2020 / 05:07 AM IST

వెస్ట్ బెంగాల్ లో ప్రధాని మోడీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. హౌరాకు వెళ్లిన ప్రధాని.. అక్కడ బేళూర్ మఠాన్ని సందర్శించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా

వెస్ట్ బెంగాల్ లో ప్రధాని మోడీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. హౌరాకు వెళ్లిన ప్రధాని.. అక్కడ బేలూరు మఠాన్ని సందర్శించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద, రామకృష్ణ పరమహంస చిత్రపటాలకు నివాళి అర్పించారు. ఆదివారం(జనవరి 12,2020) ఉదయం ప్రార్ధనల్లో పాల్గొన్న ప్రధాని.. బేలూరు మఠంలో సాధువులను ఉద్దేశించి మాట్లాడారు. అందుకు సంబంధించిన ఫొటోలను PMO ట్విట్టర్ లో షేర్ చేసింది.

సుప్రసిద్ధ బేలూరు మఠంలో పర్యటించడాన్ని తీర్ధయాత్రగా అభివర్ణించారు ప్రధాని మోడీ. స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకుని రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన బేలూరు మఠాన్ని మోడీ విజిట్ చేశారు. మఠంలోనే రాత్రి బస చేసిన మోడీ, ఇవాళ ఉదయం స్వామి వివేకానంద ఆలయంలో జరిగిన ప్రభాత ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం, ప్రధాన ఆలయాన్ని సందర్శించి శ్రీరామకృష్ణ పరమహంసకు నివాళి అర్పించారు. నేడు(జనవరి 12,2020) స్వామి వివేకానంద జయంతి. జాతీయ యువజన దినోత్సవంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
 
బేలూరు మఠంలో ప్రార్థనల తర్వాత సాధువులను ఉద్దేశించి మోడీ మాట్లాడారు. మఠాన్ని సందర్శించడం తీర్ధయాత్రకు వెళ్లిన అనుభూతిని కలిగిస్తోందన్నారు. ఇక్కడ బస చేసేందుకు అంగీకరించిన మఠం అధ్యక్షునికి, మమతా బెనర్జీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తాను ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి అత్మస్థానందజీ ఆశీస్సులు అందుకున్నానని మోడీ గుర్తు చేసుకున్నారు. స్వామీజీ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ రామకృష్ణ మఠం ద్వారా ఆయన చేసిన సేవలు, చూపించిన మార్గం అనుసరణీయమని అన్నారు. బేలూరు మఠాన్ని మోడీ సందర్శించడం ఇది రెండోసారి. 2015 మే 10న తొలిసారి మఠం సందర్శించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.