కశ్మీర్ వెళ్లి “తులిప్ గార్డెన్”అందాలు చూడండి : మోడీ

శ్రీనగర్ లోని జబర్వాన్‌ పర్వతప్రాంతంలో ఉన్న ఆసియాలోనే అతిపెద్దదైన ప్రసిద్ద "ఇందిరాగాంధీ మొమోరియల్ తులిప్‌ గార్డెన్‌" సందర్శకుల కోసం గురువారం(మార్చి-24,2021) తెరుచుకోనుంది.

Pm Modi

PM Modi శ్రీనగర్ లోని జబర్వాన్‌ పర్వతప్రాంతంలో ఉన్న ఆసియాలోనే అతిపెద్దదైన ప్రసిద్ద “ఇందిరాగాంధీ మొమోరియల్ తులిప్‌ గార్డెన్‌” సందర్శకుల కోసం గురువారం(మార్చి-24,2021) తెరుచుకోనుంది. ఈ సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

మార్చి 25 జమ్మూ కశ్మీర్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు. జబర్వాన్ కొండల్లో నెలవైన ఒక అద్భుతమైన తులిప్ గార్డెన్‌ వీక్షకుల కోసం ప్రారంభం కాబోతోంది. ఈ గార్డెన్‌లో 64 వైరైటీల్లో మొత్తం 15 లక్షల తులిప్ మొక్కలు ఉన్నాయి. మీకు ఎప్పుడు అవకాశం దొరికినా జమ్మూ కశ్మీర్‌కు వచ్చి సుందరమైన తులిప్ పండుగను ఆస్వాదించండి. తులిప్ అందాలతో పాటు జమ్మూ కశ్మీర్ ప్రజల కమ్మని ఆతిధ్యాన్ని కూడా మీరు స్వీకరిస్తారు అని మోడీ ట్వీట్ లో తెలిపారు. గార్డెన్‌కు సంబంధించిన ఫొటోలను కూడా మోడీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

కాగా, అధికారికంగా సిరాజ్ బాగ్ గా పిలువబడే ఇందిరాగాంధీ మొమోరియల్ తులిప్ గార్డెన్ ను 2008లో అప్పటి జమ్మూకశ్మీర్ సీఎం గులాంనబీ ఆజాద్ పర్యాటకుల సందర్శనార్థం ప్రారంభించారు. తులిప్ గార్డెన్‌.. నాలుగు దిక్కులా ఎటు చూసినా తులిప్ పువ్వులే మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. తెలుపు, ప‌సుపు, పింక్.. ఇలా ర‌క ర‌కాల రంగుల్లో.. ఆకాశం నుంచి చూస్తే.. ఇంద్ర ధ‌ను‌స్సు నేల మీద విరిసిందా.. అన్న‌ట్లుగా ఆ తులిప్స్ త‌మ అందాల‌తో మ‌నకు క‌నువిందు చేస్తాయి. సృష్టిలోని అంద‌మంతా త‌మ‌లోనే దాగుంద‌న్న‌ట్లు.. ప‌ర్యాటకుల చూపును త‌మ‌వైపు తిప్పుకుంటాయి. వాటిని చూసేందుకు నిజంగా మ‌న రెండు క‌ళ్లూ చాల‌వంటే అతిశ‌యోక్తి కాదు. శ్రీనగర్ లోని దాల్ లేక్ స‌మీపంలో జ‌బ‌ర్వాన్ రేంజ్‌లోని ప‌ర్వ‌తసానువుల్లో ఈ గార్డెన్ ఉంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద తులిప్ గార్డెన్‌ల‌లో ఒక‌టి కావ‌డం విశేషం.