భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమేనని ఇవాళ(ఫిబ్రవరి-25,2020) ట్రంప్ ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధం అంటూ అమెరికా గడ్డపై ట్రంప్ పలుసార్లు ప్రకటను చేయగా అప్పుడు భారత్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టింది. కశ్మీర్ భారత్ లో అతంర్భాగమని,ఆ విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదని భారత్ తేల్చిచెప్పింది. అయితే ఇప్పుడు భారత పర్యటనలో ఉన్న ట్రంప్..ఢిల్లీ వేదికగా భారత్-పాక్ ల మధ్య మధ్యవర్తిత్వం చేస్తానంటూ వ్యాఖ్యినించడం కీలకంగా మారింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై ట్రంప్ కు ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లే అర్థమవుతోంది. పాకిస్తాన్ లేకుంటే అమెరికా గన్నులు,బాంబులు ఎవరికి అమ్ముకోవాలి అనేది ట్రంప్ ఆందోళనేమో మరి.
ఇవాళ ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో మీడియాతో మాట్లాడిన ట్రంప్…ప్రతి కథకు రెండు కోణాలుంటాయని, కశ్మీర్ కూడా ఇంతేనని అన్నారు. భారత్ ధైర్యసాహసాలు కలిగిన దేశమన్నారు. భారత్-పాక్ ల మధ్య కొన్ని అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. కశ్మీర్ వివాదంలో చాలా సంక్లిష్టమైన అంశాలున్నాయన్నారు. భారత్-పాక్ దేశాల ప్రధానులతో తనకు మంచి సంబంధాలున్నాయన్నారు. రెండు దేశాల ప్రధానులు కోరితే మధ్యవర్తిత్వం వహించేందుకు రెడీ అన్నారు. పాక్ నుంచి పొంచి ఉన్న ఉగ్ర ముప్పును మోడీ ఎదుర్కోగలరన్నారు. మోడీ మాటల్లోనే కాదు చేతల్లోనూ దృఢంగా ఉంటారన్నారు. టెర్రరిజం సంగతి మోడీ చూసుకుంటారన్నారు.
పౌరసత్వ సవరణ చట్టంకి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు అల్లర్లు భారత అంతర్గత వ్యవహారమన్నారు. ఢిల్లీలో సీఏఏ హింస ఘటలనపై ట్రంప్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన ఈ సమాధానమిచ్చారు. భారత్ సరైన నిర్ఱయమే తీసుకుంటదని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మత స్వేచ్ఛకు వ్యతిరేకం కాదన్నారు. సీఏఏపై స్పందించేందుకు మాత్రం ట్రంప్ నిరాకరించారు. సీఏఏ భారత్ కు సంబంధించిన విషయమన్నారు. సీఏఏపై మోడీతో చర్చించలేదన్నారు. మత స్వేచ్ఛను కాపాడాలని తాను మోడీకి చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. భారత్ మతపరమైన స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నట్లు మోడీ చెప్పారని,ఆయన చెప్పారంటే చేస్తారని అన్నారు.
ఉగ్రవాదులపై మేము ఎక్కడైనా దాడులు చేయగలం,గెలవగం అని ట్రంప్ అన్నారు. కానీ అమాయకులను చంపడం అమెరికా లక్ష్యం కాదన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ తో తనకు మంచి సంబంధాలున్నాయన్నారు. భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమేనని అన్నారు. భారత్ శాంతిని కోరుకుంటుందన్నారు. ప్రపంచ శాంతి కోసమే ఐసిస్ చీఫ్ బాగ్దాదీని,ఇరాన్ కమాండర్ సోలేమానీని హతమార్చినట్లు తెలిపారు. ఉగ్రవాదులపై బలమైన పోరాటం చేశామన్నారు. ఆప్గనిస్తాన్,ఇరాన్ లో అమెరికా బలగాలను తగ్గిస్తామన్నారు. తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం గురించి మోడీకి వివరించినట్లు తెలిపారు. తాలిబన్లతో ఒప్పందం భారత్ కు కూడా సంతోషమేనన్నారు. తాలిబన్లతో శాంతి ఒప్పందం ఈ ప్రాంతానికి ప్రయోజనకరమన్నారు.
భారత్ టూర్ ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. భారత్ లో అద్భుత ఆతిథ్యం లభించిందన్నారు. మోడీతో బలమైన స్నేహ బంధం కుదిరిందన్నారు. ఢిఫెన్స్ రంగంలో భారత్ తో మరిన్ని ఒప్పందాలు చేసుకుంటామన్నారు. భారత్ పెట్టుబడులకు స్వర్గధాయం అన్నారు. యూఎస్ ఎనర్జీ రంగంలో భారత్ పెట్టుబడులు పెడుతోందన్నారు. వాణిజ్య యుద్ధానికి చైనానే కారణమన్నారు. సుంకాల విషయంలో భారత్ ఒత్తిళ్లకు తలొగ్గమని తేల్చిచెప్పారు. భారత కంపెనీల సీఈవోలతో సమావేశం సంతృప్తినిచ్చిందన్నారు ట్రంప్.