Nalanda University
PM Modi : బీహార్‌లోని రాజ్‌గిర్‌లో నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 9.45 గంటలకు నలంద శిథిలాలను సందర్శిస్తారు. 2016లో యూఎన్ వారసత్వ ప్రదేశంగా నలంద శిధిలాలు ప్రకటించబడ్డాయి. అయితే, ఇవాళ ఉదయం 10.30 గంటలకు నలంద కొత్త క్యాంపస్‌ను మోదీ ప్రారంభిస్తారు. అనంతరం ప్రసంగిస్తారు. నలంద కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ వేడుకకు 17దేశాలకు చెందిన మిషన్ల అధిపతులతోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నాయి.
Also Read : ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వారికి మాత్రమే..!
నలంద క్యాంపస్‌లో 1900 సీటింగ్ సామర్థ్యంతో 40 తరగతి గదులు, రెండు అకడమిక్ బ్లాక్‌లు, 300 సీట్ల సామర్థ్యంతో రెండు ఆడిటోరియంలు ఏర్పాటు చేశారు. సుమారు 550 మంది విద్యార్థులకు హాస్టల్ వసతి సదుపాయం ఉంది. 2000 మంది వ్యక్తులకు వసతి కల్పించే యాంఫీథియేటర్, ఫ్యాకల్టీ క్లబ్ ల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి అనేక ఇతర సౌకర్యాలను కూడా నలంద విశ్వవిద్యాలయంలో కల్పించారు. సోలార్ ప్లాంట్లు, తాగునీటి శుద్ధి కర్మాగారాలు, మురుగునీటిని పునర్వినియోగం చేసే నీటి రీసైక్లింగ్ ప్లాంట్, 100 ఎకరాల నీటి వనరులు అనేక ఇతర పర్యావరణ అనుకూల సౌకర్యాలతో క్యాంపస్ ను నిర్మించారు.
Also Read : నాన్నా.. దయచేసి ఒక్కసారి వచ్చిపోండి.. అమరుడైన తండ్రికోసం కొడుకు వాయిస్ మెసేజ్ లు..
నలంద విశ్వవిద్యాలయ క్యాంపస్ భారత్, తూర్పు ఆసియా సమ్మిట్ (EAS) దేశాల మధ్య సహకారంగా రూపొందించబడింది. దాదాపు 1600 సంవత్సరాల క్రితం స్థాపించబడిన నలంద విశ్వవిద్యాలయం.. ప్రపంచంలోని మొదటి నివాస విశ్వవిద్యాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.