నాన్నా.. దయచేసి ఒక్కసారి వచ్చిపోండి.. అమరుడైన తండ్రికోసం కొడుకు వాయిస్ మెసేజ్ లు..

నానా ఒక్కసారి వచ్చిపో నాన్నా అంటూ.. తండ్రి వాడిన ఫోన్ కు వాయిస్ మెసేజ్ లు పంపిస్తున్నాడు. వీడియో కాల్ చేయండి నాన్నా అంటూ అభ్యర్ధిస్తున్నాడు.

నాన్నా.. దయచేసి ఒక్కసారి వచ్చిపోండి.. అమరుడైన తండ్రికోసం కొడుకు వాయిస్ మెసేజ్ లు..

Colonel Manpreet Singh

Colonel Manpreet Singh son sending voice messages : ప్రతిఒక్కరి మనస్సులను మెలిపెట్టే చిన్నారి కథ ఇది.. తన తండ్రిని చూసేందుకు కొడుకు పడుతున్న మనోవేదన ప్రతిఒక్కరికి కన్నీరు తెప్పిస్తోంది. తండ్రి చనిపోయాడని తెలిసినా ఆ పసివాడు జీర్ణించుకోలేక పోతున్నాడు. దీంతో తండ్రి ఫోన్ కు నిత్యం వాయిస్ మెసేజ్ లు పంపిస్తూ.. నానా.. దయచేసి ఒక్కసారి తిరిగిరండి.. ఆ తరువాత మళ్లీ మీ విధులకు వెళ్లండి.. కనీసం ఒక్కసారి వీడియో కాల్ అయినా చేయండి నాన్నా అంటూ వేడుకుంటున్నాడు. తాను ఇంతవేడుకుంటున్నా గతంలో తమకోసం పరిగెత్తుకొచ్చే తండ్రి.. ఇప్పుడు ఎందుకు రావడం లేదో ఆ చిన్నారి అర్ధంచేసుకోలేక పోతున్నాడు. తండ్రిని ఒక్కసారి చూసేందుకు ఆ చిన్నారి పడుతున్న బాధను చూసి స్థానికులు చలించిపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : వ్యూహాత్మకంగా ప్రియాంక గాంధీ అడుగులు.. అక్కడ గెలిస్తే కాంగ్రెస్‌కు పునర్ వైభవం ఖాయమా?

ఆర్మీలో 19వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన కల్నల్ మన్ ప్రీత్ సింగ్ కమాండింగ్ ఆఫీసర్ గా పనిచేశాడు. జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ లో పనిచేశారు. జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ లో కొకెన్ నాగ్ కు చెందిన గడోల్ అడవుల్లో గత ఏడాది సెప్టెంబర్ 13న ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే క్రమంలో మన్ ప్రీత్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. మన్ ప్రీత్ సింగ్ మరణించిన తరువాత చిన్నారుల కళ్ల ఎదుటే అతని అత్యక్రియలు నిర్వహించారు. అయితే, మన్ ప్రీత్ సింగ్ కొడుకు తన తండ్రి ఇకరాలేడనే విషయాన్ని అర్ధంచేసుకోలేక పోతున్నాడు. తండ్రి ఎప్పడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. నానా ఒక్కసారి వచ్చిపో నాన్నా అంటూ.. తండ్రి వాడిన ఫోన్ కు వాయిస్ మెసేజ్ లు పంపిస్తున్నాడు. వీడియో కాల్ చేయండి నాన్నా అంటూ అభ్యర్ధిస్తున్నాడు. వాళ్ల అమ్మకు వినిపించకూడదని గుసగుసలాడుతూ వాటిని పంపిస్తున్నాడట. చనిపోయిన తండ్రి వాడిన ఫోన్ కు ఆ చిన్నారి పంపిస్తున్న వాయిస్ మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : Highest Paid Actress : అలియా కాదు.. కంగ‌నా కాదు.. బాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న న‌టి ఎవ‌రంటే..?

కల్నల్ మన్‌ప్రీత్ భార్య జగ్మీత్ మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో రెండు చెట్లను నాటి వాటికి తన పిల్లలు కబీర్, వాణీ పేర్లు పెట్టారు. పదేళ్ల తరువాత ఈ చెట్లను చూడటానికి వెళ్దామని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపయాడని కన్నీటి పర్యాంతమయ్యారు. ఆయన ఎప్పటికీ రాడనే నిజం తెలియని పిల్లలు ఇంకా తన తండ్రి విధుల్లోనే ఉన్నాడని నమ్ముతున్నారంటూ జగ్మీత్ ఆవేదనకు గురయ్యారు. తన భర్తతో చివరిసారిగా మాట్లాడిన మాటలను జగ్మీత్ గుర్తు చేసుకున్నారు. నేను ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో ఉన్నాను అని మన్‌ప్రీత్ చెప్పాడు. ఆ సమయంలో వీరి మధ్య 32 సెకన్ల పాటు మాత్రమే సంభాషణలు జరిగాయి. ఆవే తనతో నా భర్త మాట్లాడిన చివరి మాటలు అంటూ జగ్మీత్ గుర్తుచేసుకొని కన్నీటి పర్యాంతమయ్యారు.