వారణాశిలో నామినేషన్ వేసిన ప్రధాని

వారణాశి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం(ఏప్రిల్-26,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీ నామినేషన్ వేశారు. వారణాశిలోని కలక్టరేట్ లో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి మోడీ సమర్పించారు. అంతకుముందు వారణాశిలోని కాలభైరవుడి ఆలయంలో పూజలు చేసిన అనంతరం కలెక్టరు కార్యాలయానికి చేరుకొని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్రమంత్రులు, ఇతర ఎన్డీయే నేతలతో కొద్ది సేపు మోడీ ముచ్చటించారు.
Also Read : ఒక్క రోజులోనే 10 లక్షల టికెట్స్ సేల్ : అవెంజర్స్ రికార్డ్

2014లోక్ సభ ఎన్నికల్లో వారణాశి స్థానం నుంచే పోటీ చేసి భారీ మెజార్టీతో మోడీ విజయం సాధించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరోసారి అదే స్థానం నుంచి మోడీ పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేసేందుకు గురువారమే వారణాశి చేరుకుని మెగా రోడ్ షో నిర్వహించారు మోడీ.వేల సంఖ్యలో ప్రజలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు.గురువారం గంగా హారతి కార్యక్రమంలో కూడా మోడీ పాల్గొన్నారు.ఏడో విడతలో మే-19,2019న వారణాశి లోక్ సభ స్థానానికి పోలింగ్ జరుగనుంది.మే-23,2019న ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read : రాహుల్‌కి తప్పిన ప్రమాదం : ఫ్లైట్‌లో టెక్నికల్ ప్రాబ్లం