PM Modi : గుజరాత్‌లో ఈరోజు నుంచే ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన.. WHO చీఫ్ టెడ్రొస్ కూడా..

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఏప్రిల్ 18) నుంచి తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మూడు రోజులు పర్యటించనున్నారు. ఆయన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (ఏప్రిల్ 18) నుంచి తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో మూడు రోజులు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ గాంధీనగర్, బనస్కాంత, జామ్‌నగర్ దాహోద్‌లలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాలు గుజరాత్ ప్రజలకు ఈజ్ ఆఫ్ లివింగ్‌ని పెంచుతాయని ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ (tedros Ghebreyesus) కూడా మూడు రోజుల పర్యటనలో పాల్గొంటారు.

ప్రధాని మోదీతో కలిసి ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (GCTM) శంకుస్థాపన కోసం జామ్‌నగర్‌లో మంగళవారం ప్రధాని మోదీతో కలిసి పర్యటించనున్నారు. అంతకుముందు ఘెబ్రేయేసస్ రాజ్‌కోట్ చేరుకోనున్నారు. ఆ రాత్రి అక్కడే బస చేయనున్నారు. మారిషస్ ప్రధాన మంత్రి ప్రవింద్ కుమార్ జుగ్నాథ్ కూడా సోమవారం రాజ్‌కోట్‌కు చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన అశ్వికదళం మార్గంలో సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలుకనున్నారు.

Pm Narendra Modi On 3 Day Gujarat Tour From Today, Who Chief To Join Him 

ప్రధాని మోదీ 3 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ముందుగా ఈరోజు (సోమవారం) విద్యా సమీక్ష కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శిస్తారు. విద్యారంగంలో పలువరితో తాను మాట్లాడుతానని మోదీ చెప్పారు. మంగళవారం బనస్కాంతలో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.600 కోట్లు ఖర్చు చేయనుంది. బనాస్ డైరీ కాంప్లెక్స్.. పొటాపొ ప్రాసెసింగ్ ప్లాంట్ మోదీ ప్రారంభిస్తారు. ఈ రెండింటితో స్థానిక రైతులకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషినల్ మెడిజిన్, గాంధీనగర్‌లో మహాత్మా మందిర్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నొవేషన్ సమ్మిట్‌లో పాల్గొంటారు.

ఆ తర్వాత దాహొద్‌లో ఆదివాసి మహా సమ్మేళనంలో మోదీ పాల్గొంటారు. ఇదీ పేదలకు మేలు చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బనస్కాంత జిల్లాలో రూ.600 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త డెయిరీ కాంప్లెక్స్ బంగాళాదుంప ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. వ్యవసాయం, పశుపోషణకు సంబంధించిన కీలకమైన శాస్త్రీయ సమాచారాన్ని రైతులకు అందించడానికి బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ రేడియో స్టేషన్‌ను కూడా మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ రేడియో స్టేషన్ దాదాపు 1700 గ్రామాలకు చెందిన 5 లక్షల మంది రైతులతో అనుసంధానం అవుతుందని భావిస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) తెలిపింది.

Read Also : PM Modi: ప్రపంచమే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్’గా ఎలా మారాలని ఆలోచిస్తోంది: ప్రధాని మోదీ

ట్రెండింగ్ వార్తలు