PM Modi: ప్రపంచమే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్’గా ఎలా మారాలని ఆలోచిస్తోంది: ప్రధాని మోదీ

"మనం ఎప్పటికీ ఇలానే ఉండలేము. ప్రపంచంలో ఇపుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..ప్రతి దేశం "ఆత్మనిర్భర్"గా ఎలా మారాలనే విధంగా ఆలోచనచేస్తుంది" అని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi: ప్రపంచమే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్’గా ఎలా మారాలని ఆలోచిస్తోంది: ప్రధాని మోదీ

Modi

PM Modi: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ప్రతి దేశం “ఆత్మనిర్భర్”గా ఎలా మారాలనే ఆలోచనలో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ లోని మొర్బిలో 108 అడుగుల ఆంజనేయ విగ్రహాన్ని శనివారం ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ..సంక్షోభ పరిస్థితుల నుంచి గుణపాఠం నేర్చుకుని భారత్ ముందుకు సాగుతుందని అన్నారు. కరోనా నేర్పిన గుణపాఠం, రష్యా యుక్రెయిన్ యుద్ధం తెచ్చిన ఆర్ధిక నష్టాలు..ఇలా ఎప్పటికప్పడు ప్రపంచ దేశాలకు సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయని మోదీ అన్నారు. ఈ తరుణంలో భారతదేశం స్తబ్దుగా ఉండలేదని, స్వయం సమృద్ధిగా మారాలని ఆయన అన్నారు. “మనం ఎప్పటికీ ఇలానే ఉండలేము. ప్రపంచంలో ఇపుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..ప్రతి దేశం “ఆత్మనిర్భర్”గా ఎలా మారాలనే విధంగా ఆలోచనచేస్తుంది” అని ప్రధాని మోదీ అన్నారు.

Also Read:Hardik Patel: మా పార్టీలోకి రండి.. హార్దిక్ పటేల్‌కు ఆమ్‌ఆద్మీ పిలుపు

స్వదేశీ ఉత్పత్తులనే వాడే విధంగా యోగ్యులు ప్రజల్లో అవగాహనా కల్పించాలని, “వోకల్ ఫర్ లోకల్”కు ఊతమివ్వాల్సిన సమయం ఇదేనని మోదీ అన్నారు. మన ప్రజలు తయారు చేసిన వస్తువులనే మన ఇళ్లల్లో వాడాలన్న ప్రధాని మోదీ..తద్వారా ఉత్పత్తి వినియోగ వ్యయం పెరిగి దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. విదేశాల్లో తయారైన వస్తువులు మనకు మంచి అనుభూతిని కలిగిస్తాయి, కానీ మన ప్రజల కష్టాల విలువను, మన మాతృభూమి యొక్క సువాసన ఆయా వస్తువుల్లో ఉండదని ఆయన అన్నారు. “రాబోయే 25 సంవత్సరాలలో, మనం కేవలం స్థానిక ఉత్పత్తులను ఉపయోగిస్తే, మన ప్రజలకు నిరుద్యోగం ఉండదు” అని ప్రధాన మంత్రి అన్నారు.

Also Read:Puducherry Express: ఎదురెదురుగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. పట్టాలు తప్పిన మూడు భోగీలు