Puducherry Express: ఎదురెదురుగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. పట్టాలు తప్పిన మూడు భోగీలు

ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్ సమీపంలో దాదర్-పుదుచ్చేరీ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న సీఎస్ఎమ్టీ-గదగ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగిందని సెంట్రల్

Puducherry Express: ఎదురెదురుగా వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. పట్టాలు తప్పిన మూడు భోగీలు

Train Accident

Puducherry Express: ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్ సమీపంలో దాదర్-పుదుచ్చేరీ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న సీఎస్ఎమ్టీ-గదగ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగిందని సెంట్రల్ రైల్వే అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి 9గంటల 45నిమిషాలకు జరిగిన ఈ ఘటనలో మూడు భోగీలు పట్టాలు తప్పాయి. ఎటువంటి తీవ్రగాయాలు నమోదుకాలేదు.

గదగ్ ఎక్స్‌ప్రెస్ సిగ్నల్ పట్టించుకోకుండా ముందుకు వచ్చేయడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. తొలి ప్యాసింజర్ ట్రైన్ 169వ వార్షికోత్సవం జరుపుకోవడానికి ఒకరోజు ముందే ఈ ఘటన నమోదైంది. అందిన సమాచారం మేరకు గదగ్ ఎక్స్‌ప్రెస్ సిగ్నల్ ను ఖాతరు చేయకుండా ముందుకు వెళ్లిపోయిందని అంటున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఘటన తర్వాత కొన్ని ఎక్స్‌ప్రెస్ లతో పాటు లోకల్ ట్రైన్లను కూడా క్యాన్సిల్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఫలితంగా పలు రైళ్ల సేవలకు అంతరాయం కలిగింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకటికొకటి ఎదురుగా రావడం, అందులో ప్రయాణిస్తున్న వారు ఇలా జరుగుతుందని అలర్ట్ అవుతుండటం అన్నీ రికార్డ్ అయ్యాయి. సెంట్రల్ రైల్వే అధికార ప్రతినిధి శివాజీ సుతార్ ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

Read Also : ఎర్ర చీరతో ఘోర రైలు ప్రమాదాన్ని తప్పించిన గ్రామీణ మహిళ

ఇదే నెలలో జరిగిన రెండో ఘటన ఇది. అంతకంటే ముందు లోకమాన్య తిలక్ – జయనగర్ ఎక్స్‍‌ప్రెస్ ఏప్రిల్ 3న పరస్పరం ఢీకొన్నాయి.