PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం.. డొమినికా అత్యున్నత పురస్కారంతో సత్కారం

ప్రధాని నరేంద్ర మోదీ డొమినికా దేశంకు చెందిన అత్యున్నత జాతీయ అవార్డును అందుకున్నారు. గయానాలో జరిగిన ఇండియా-కారికోమ్ సమ్మిట్‌ సదర్భంగా

Narendra modi and Sylvanie Burton

Narendra Modi Dominica Award: ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. కరేబియన్ దేశం కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును మోదీకి అందజేసింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో భాగంగా గయానా చేరుకున్నారు. గయానాలో జరిగిన ఇండియా-కారికోమ్ సమ్మిట్‌ సదర్భంగా డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ప్రధాని మోదీని కలిసి ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’తో సత్కరించారు. కొవిడ్ -19 సంక్షోభ సమయంలో ప్రధాని మోదీ ఆ దేశానికి అందించిన మద్దతు, భారత్ – డొమినికా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మోదీ చేసిన కృషికిగాను డొమినికా అత్యున్నత పురష్కారంతో సత్కరించారు.

Also Read: ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో కమల వికాసం..! ఎన్డీయే కూటమి వైపే సర్వే సంస్థల మొగ్గు..

అవార్డును అందుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. డొమినికా అత్యున్నత జాతీయ అవార్డుతో సత్కరించడం గౌరవంగా భావిస్తున్నాను. దీన్ని 140 కోట్ల మంది భారత ప్రజలకు అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రెసిడెంట్ సిల్వానీ బర్టన్.. నాకు ఈ అవార్డును అందజేయడానికి వ్యక్తిగతంగా గయానా వచ్చారు. మీకు ధన్యవాదాలు. భారతదేశం -డొమినికా రెండు ప్రజాస్వామ్య దేశాలు. దీనితో పాటు మొత్తం ప్రపంచానికి మహిళా సాధికారతకు మేము రోల్ మోడల్. రెండు దేశాలకు మహిళా అధ్యక్షురాళ్లు ఉన్నారు. వీరిద్దరూ ప్రపంచంలోని మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని మోదీ అన్నారు. భారతదేశం, డొమినికా శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నాయి. 19వ శతాబ్దంలో చాలా మంది భారతీయులు డొమినికాను తమ నివాసంగా చేసుకున్నారు. వారు వేసిన పునాది మన సంబంధాలకు బలమైన పునాదిగా అందిస్తుందని అన్నారు.

 

గత కొన్నేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు పట్ల ప్రపంచ దేశాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయా దేశాలకు భారతదేశం అందిస్తున్న సహాయాన్ని దృష్టిలో ఉంచుకొని పలు దేశాలు ఆ దేశాల అత్యున్నత స్థాయి పురస్కారాలతో ప్రధాని మోదీని గౌరవిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో డొమినికా కూడా చేరింది. కోవిడ్ కాలంలో చేసిన సహాయంకుగాను ప్రధాని మోదీని అత్యున్నత గౌరవం (డొమినికా హైయెస్ట్ నేషనల్ హానర్)తో డొమినికా సత్కరించింది. దీంతో ప్రధాని అందుకున్న మొత్తం అంతర్జాతీయ అవార్డుల సంఖ్య 19కి చేరుకుంది.

 

అదేవిధంగా గయానా దేశం ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ను అందజేసింది. ఈ పురస్కారాన్ని గయానా దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందజేశారు. ప్రపంచ దేశాలకు మోదీ అందిస్తున్న సహాయ సహకారాలకుగాను ఈ గుర్తింపు లభించింది.