ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో కమల వికాసం..! ఎన్డీయే కూటమి వైపే సర్వే సంస్థల మొగ్గు..
ఈ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ, దాని మిత్రపక్షాల్లో జోష్ నింపగా.. ఇవన్నీ తప్పుడు అంచనాలు అంటూ ఎగ్జిట్ పోల్స్ చర్చలను కాంగ్రెస్ నేతలు బాయ్ కాట్ చేశారు.

Exit Poll Results 2024 : దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మహారాష్ట్రతో పాటు ఝార్ఖండ్ లోనూ బీజేపీ మిత్రపక్షాలే జెండా ఎగురవేస్తాయని సర్వే సంస్థలన్నీ అటువైపే మొగ్గు చూపాయి. మహారాష్ట్రలో మహాయుతికే ప్రజలు పట్టం కడతారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా.. ఝార్ఖండ్ ప్రజలు ఎన్డీయే జట్టుకే జై కొడుతున్నట్లు చెబుతున్నాయి. ఈ
ఎగ్జిట్ పోల్స్ బీజేపీ దాని మిత్రపక్షాల్లో జోష్ నింపగా.. ఇవన్నీ తప్పుడు అంచనాలు అంటూ ఎగ్జిట్ పోల్స్ చర్చలను కాంగ్రెస్ నేతలు బాయ్ కాట్ చేశారు.
ఇక, మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు పట్టం కట్టాయి. ఈసారి కూడా ప్రజలు అధికార పార్టీనే గెలిపించబోతున్నారని తెలిపాయి. పీపుల్స్ పల్స్ సర్వే ఎన్డీయేకు 175 నుంచి 195.. ఎంవీయేకు 85-112 సీట్లు వస్తాయని తెలిపింది. ఎన్డీయేకు 135-157.. ఎంవీయేకు 126-146 సీట్లు వస్తాయని పీ మార్క్ అంచనా వేసింది.
ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్రలో గెలుపు ఎవరిది అంటే..
పీ మార్క్ సంస్థ..
ఎన్డీయే-137-157
ఇండియా-126-146
ఇతరులు-2-8
Matrize సంస్థ..
ఎన్డీయే-150-170
ఇండియా-110-130
ఇతరులు-8-10
పీపుల్స్ పల్స్..
ఎన్డీయే-175-195
ఇండియా-85-112
కేకే సర్వేస్..
ఎన్డీయే-225
ఇండియా-56
ఇతరులు-7
చాణక్య స్ట్రాటజీస్..
ఎన్డీయే-152-160
ఇండియా-130-138
ఇతరులు-6-8
పోల్ డైరీ..
ఎన్డీయే-122-186
ఇండియా-69-121
సీఎన్ఎన్ న్యూస్ 18
ఎన్డీయే-154
ఇండియా-128
ఇతరులు-06
ఎగ్జిట్ పోల్స్- ఝార్ఖండ్ లో ఏ పార్టీ గెలుస్తుందంటే..
టైమ్స్ నౌ-జేవీసీ..
జేఎంఎం ప్లస్-30-40
ఎన్డీయే – 40-44
ఇతరులు – 01
సీఎన్ఎన్ న్యూస్ 18..
జేఎంఎం ప్లస్ – 30
ఎన్డీయే – 47
ఇతరులు – 04
మ్యాట్రిజ్..
జేఎంఎం ప్లస్ – 25-30
ఎన్డీయే – 42-47
ఇతరులు – 1-4
పీపుల్స్ పల్స్..
జేఎంఎం ప్లస్ – 24-37
ఎన్డీయే – 44-53
ఇతరులు – 06-10
చాణక్య..
జేఎంఎం ప్లస్ – 35-38
ఎన్డీయే – 45-50
ఇతరులు – 3-5
యాక్సిస్ మై ఇండియా..
జేఎంఎం ప్లస్ – 53
ఎన్డీయే – 25
ఇతరులు – 03
ఐ-పీపీఆర్..
జేఎంఎం ప్లస్ – 26
ఎన్డీయే – 48
ఇతరులు – 06
రెండు రాష్ట్రాల్లోనూ 60శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఎంతో ఉత్కంఠభరితంగా ఎన్నికల ప్రచారం నడిచింది. ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు పోటాపోటీ హామీలు ఇచ్చాయి ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయేదే విజయం అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 145. అక్కడ ఆ ఫిగర్ ను ఎన్డీయే కూటమి దాటేస్తుందని అంచనా వేశాయి. 180 ప్లస్ సీట్లు కూడా మహాయుతి కూటమికి రావొచ్చని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి.
ఝార్ఖండ్ లో మ్యాజిక్ ఫిగర్ 42. అక్కడ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరిస్తుందని అంచనా వేశాయి. సుమారు 45 నుంచి 50 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, ఎన్డీయే కూటమిగా మరిన్ని అధిక స్థానాలు వస్తాయిని జాతీయ స్థాయి పోల్ సర్వే సంస్థలు పట్టం కట్టాయి. కాగా, హర్యానా ఎన్నికల ఫలితాల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తారుమారమైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు ఎగ్జాట్ పోల్స్ అవుతాయన్నది ఈ నెల 23న తేలనుంది.
Also Read : యవ్వనం కోసం టెక్ బిలియనీర్ పాట్లు.. బెడిసికొట్టిన యాంటీ ఏజింగ్ ప్రయోగం..!