Bryan Johnson : యవ్వనం కోసం టెక్ బిలియనీర్ పాట్లు.. బెడిసికొట్టిన యాంటీ ఏజింగ్ ప్రయోగం..!
Bryan Johnson : బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ ప్రయోగంలో భాగంగా "ప్రాజెక్ట్ బేబీ ఫేస్" అనే ప్రక్రియలో ముఖంలోకి కొవ్వుతో కూడిన ఎక్స్‌ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్‌ను ఇంజెక్ట్ చేసినట్లు తెలిపాడు.

Tech billionaire Bryan Johnson
Bryan Johnson : టెక్ మొగల్ సుప్రసిద్ధ బయోహ్యాకర్, బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ ప్రయోగం ఊహించని మలుపు తిరిగింది. వృద్ధాప్యం నుంచి యవ్వన రూపాన్ని పొందేందుకు కోట్లాది రూపాయలను హెచ్చించిన మిలియనీర్ ముఖం వికారంగా మారిపోయింది. యవ్వన రూపం కోసం అతడి ముఖంలోకి కొవ్వు ఇంజెక్షన్ వేయగా ముఖమంతా ఎర్రగా ఉబ్బిపోయింది. ఇదే విషయాన్ని టెక్ బిలియనీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రయోగానికి సంబంధించిన వివరాలను వెల్లడించాడు. ముఖంలో వాపు, ఎర్రటి ముఖం కనిపించే ఫొటోలను చిత్రాలను షేర్ చేశాడు.
యాంటీ ఏజింగ్ ప్రక్రియ కారణంగానే తన ముఖంలో తీవ్రమైన వాపుకు దారితీసిందని పేర్కొన్నాడు. బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ ప్రయోగంలో భాగంగా “ప్రాజెక్ట్ బేబీ ఫేస్” అనే ప్రక్రియలో ముఖంలోకి కొవ్వుతో కూడిన ఎక్స్‌ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్‌ను ఇంజెక్ట్ చేసినట్లు తెలిపాడు. ఇంజెక్షన్లు వేసిన వెంటనే అతని ముఖం ఎర్రగా వాచిపోయిందని చెప్పాడు. తీవ్రమైన అలెర్జీ కారణంగానే ఇలా జరిగిందని జాన్సన్ చెప్పుకొచ్చాడు.
ఒక డోనర్ ఇచ్చిన కొవ్వును తన ముఖంలో ఇంజెక్ట్ చేసే సమయంలో ఎలర్జీ కారణంగా ముఖమంతా ఎర్రగా అయిందని అన్నాడు. ఇంజెక్షన్ తీసుకున్న వెంటనే తన ముఖంలో మంట మొదలైందని, ఒక్కసారిగా అధ్వాన్నంగా మారిపోయిందని వాపోయాడు. తన డైట్‌లో 1950 కేలరీలతో భారీగా బరువు తగ్గిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే, ఏడు రోజుల తర్వాత తన ముఖం సాధారణ స్థితికి వచ్చిందని తెలిపాడు. అంతేకాదు.. తాను తాత్కాలికంగా తన దృష్టిని కూడా కోల్పోయాడని వెల్లడించాడు. బ్రయాన్ తన లేటెస్ట్ థెరపీ సెషన్ గురించి కూడా పేర్కొన్నాడు.
ఇప్పటికే జాన్సన్ జీవసంబంధమైన వయస్సును తగ్గించే క్రమంలో 30 మంది సైంటిస్టులు, వైద్యుల బృందం సాయంతో భారీగా మందుల వినియోగం, వ్యాయామం, అనేక చికిత్సలతో వయస్సును తగ్గించుకున్నాడు. తదుపరి ప్రయోగానికి సంబంధించిన ప్రణాళికలపై కూడా తన టీం నిమగ్నమైందని చెప్పాడు. ఆల్-ఓవర్ స్కిన్ లేజర్ ట్రీట్‌మెంట్, యాంటీ యాజింగ్ మందులు చికిత్సల కారణంగా చర్మ వయస్సు, గుండె, లివర్ శరీరంలోని ప్రతీ భాగం వయస్సు తగ్గినట్టు బ్రయాన్ జాన్సన్ ఇదివరకే ప్రకటించాడు.
View this post on Instagram
జాన్స్ యాంటీ ఏజింగ్ ప్రయోగంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రకృతికి విరుద్ధంగా ఎందుకు వెళ్లాలి? ఇలానే జరుగుతుందని ఒక యూజర్ కామెంట్ చేశాడు. “మీరు ఆరోగ్యమైనవి తినవచ్చు. రోజూ వ్యాయామం చేయవచ్చు. ప్రకృతిలో సమయం గడపవచ్చు. విటమిన్ డిని పుష్కలంగా పొందవచ్చు. మిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? మానసిక ఆరోగ్యం చాలా చౌకగా ఉంటుంది. ఇలా చేస్తే మీరు ఎక్కువ కాలం జీవించగలరా? అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
Read Also : Redmi A4 5G Launch : రెడ్‌మి A4 5జీ ఫోన్ వచ్చేసింది.. ఫస్ట్ ఎంట్రీ లెవల్ ఫోన్ ఇదే.. ధర ఎంతంటే?