ex-J&K Guv Satya Pal Malik
Pulwama Attack: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం గురించి దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చెప్తే.. మౌనంగా ఉండమని సలహా ఇచ్చినట్లు జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన సత్యపాల్ మాలిక్ అన్నారు. తాజాగా ఆయన ‘ది వైర్’ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి పరిస్థితులు, ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహారం పట్ల చెప్పిన విషయం తాజాగా సంచలనంగా మారాయి. పుల్వామా దాడి విషయమై సత్యపాల్ చెప్పి చెప్పిన విషయాలు మోదీ ప్రభుత్వాన్ని అత్యంత ఇరకాటంలో నెట్టేవిగా ఉన్నాయి.
Karnataka Polls: అనుకున్నదే చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. మాజీ సీఎం సిద్దరామయ్యకు కోలార్ టికెట్ మిస్
సైనికుల భద్రత గురించి తనకు ముందుగానే అనుమానాలు ఉన్నాయని, వారిని రోడ్డు మార్గం ద్వారా కాకుండా విమానం ద్వారా తరలించాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించానని అయితే వారి నుంచి తిరస్కారం ఎదురైందని అన్నారు. ‘‘సీఆర్‌పీఎఫ్ జవాన్లను తీసుకెళ్లడానికి విమానాలు కావాలని అడిగాను. ఎందుకంటే ఇంత పెద్ద కాన్వాయ్ సాధారణంగా రోడ్డుపై ప్రయాణించదు. వారిని నేను ఐదు విమానాలు కావాలని అడిగాను. అయితే అందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిరాకరించింది. దీని వల్ల భద్రతా సమస్య ఏర్పడింది’’ అని పుల్వాదా దాడికి ముందు జరిగిన పరిణామాల గురించి సత్యపాల్ మాలిక్ చెప్పారు.
Karnataka Polls: కావాలనే ఆలస్యం చేసిన జేడీఎస్.. కాంగ్రెస్, బీజేపీ నేతలే టార్గెట్
ఈ దాడి అనంతరం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫోన్ చేసి మాట్లాడారట. అయితే ఆ సమయంలో మోదీ చేసిన సూచన విని ఖంగుతిన్నానని అన్నారు. ‘‘మనం చేసిన తప్పు వల్లే ఇలా జరిగిందని (పుల్వామా దాడి) ప్రధాని మోదీతో చెప్పాను. విమానం సమకూర్చి ఉంటే ఇలా జరిగేది కాదని అన్నాను. కానీ ఆయన నన్ను మౌనంగా ఉండమని అన్నారు(యే మత్ బోలియే, యాప్ చుప్ రహియే)’’ అని అన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం తనను మౌనంగా ఉండమని సూచించినట్లు తెలిపారు.
“ఆయన నేషనల్ కార్బెట్ పార్క్‌లో ఉన్నారని నాకు గుర్తుంది. అక్కడ షూటింగ్ చేస్తున్నారు. అక్కడ ఫోన్ సౌకర్యం లేదు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక దాబా నుంచి నాకు ఆయన కాల్ చేసారు. ‘ఏమి జరిగింది సత్పాల్?’ అని అడిగారు. ఇది జరిగిందని నేను చెప్పాను. నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. మొత్తం బాధ్యత పాకిస్తాన్‌పై మోపబడడుతుందని నేను గ్రహించాను. అందుకే నేను మౌనంగా ఉండవలసి వచ్చింది” అని సత్యపాల్ మాలిక్ అన్నారు. సత్యపాల్ మాలిక్ ఆగస్ట్ 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పని చేశారు. అనంతరం ఆయనను మేఘాలయ గవర్నర్‌గా మోదీ ప్రభుత్వం మార్చింది. ఈయన గవర్నర్‌గా ఉన్న సమయంలోనే జమ్మూ కశ్మీర్‌కు కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.