Karnataka Polls: అనుకున్నదే చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. మాజీ సీఎం సిద్దరామయ్యకు కోలార్ టికెట్ మిస్

మూడవ జాబితాలో 43 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీకి అథానీ నియోజక వర్గం నుంచి టికెట్ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka elections 2023) వేళ 61 మంది నేతలతో పరిశీలకులను నియమించింది కాంగ్రెస్.

Karnataka Polls: అనుకున్నదే చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. మాజీ సీఎం సిద్దరామయ్యకు కోలార్ టికెట్ మిస్

Siddaramaiah

Karnataka Polls: రెండు స్థానాల నుంచి బరిలోకి దిగాలని అనుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు కాంగ్రెస్ పార్టీ (Congress) మొండిచేయే చూపించింది. తాజాగా విడుదల చేసిన మూడవ జాబితా (third list)లో కోలార్ టికెట్ సిద్ధరామయ్యకు కాకుండా మరొకరికి కేటాయించారు. ఈ స్థానం నుంచి కోతూర్ జి మంజునాథ్ బరిలోకి దిగనున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఇప్పటికే ఆయన వరుణ నుంచి చేయనున్నారు. అయితే రెండో స్థానం నుంచి కూడా పోటీ చేయాలనుకున్న సిద్ధరామయ్యకు చివరిక చుక్కే ఎదురైంది.

Ambedkar statue: అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నాకు ఆహ్వానం రాలేదు: గవర్నర్ తమిళిసై

రెండు స్థానాల్లో పోటీపై ఆయన గతంలో పలు ప్రకటనలు చేశారు. అయితే కోలార్ స్థానం అనుకూలంగా లేదని, అక్కడి నుంచి పోటీ చేస్తే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని అధిష్టానం చేసిన సర్వేలో తేలిందని ఢిల్లీ పెద్దలు కొద్ది రోజుల క్రితం సిద్ధరామయ్యతో చెప్పారు. అనంతరం మొదటి జాబితాలోనే వరుణ నుంచి అవకాశం కల్పించారు. అయినప్పటికీ ఆయన తన ప్రయత్నాలను మానుకోలేదు. కానీ తాజాగా మూడవ జాబితా కూడా విడుదల కావడంతో ఆయన ప్రయత్నాలు విఫలమైనట్లే తేలిపోయాయి. ఎందుకంటే ఈ జాబితాతో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించినట్లైంది. అంతే కాకుండా, సిద్ధరామయ్య అనుకున్న కోలార్ అభ్యర్థిత్వంపై కూడా స్పష్టత వచ్చింది.

Delhi Liquor Scam: తాను అవినీతిపరుడైతే లోకంలో నిజాయిపరులే ఉండరట.. కేజ్రీవాల్ చిత్రమైన వ్యాఖ్యలు

మూడవ జాబితాలో 43 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీకి అథానీ నియోజక వర్గం నుంచి టికెట్ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka elections 2023) వేళ 61 మంది నేతలతో పరిశీలకులను నియమించింది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏఐసీసీ పరిశీలకులుగా నియమితమైవారిలో ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఆదివాసీ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్ కూడా ఉన్నారు.

Karnataka Polls: బీజేపీ శైలికి వ్యతిరేకంగా యడియూరప్ప హాట్ కామెంట్స్.. వాటికి వ్యతిరేకమంటూ స్టేట్మెంట్

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రధాన విపక్షం కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో మూడో పెద్ద పార్టీగా ఉన్న జేడీఎస్ ను అంత సులువుగా తీసుకోలేమని కూడా అంటున్నారు. గతంలో పలుమార్లు ఈ పార్టీ వల్ల కాంగ్రెస్, బీజేపీలు మెజారిటీని రాబట్టడంలో విఫలమయ్యాయి.